ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: నేడు నాగర్‌కర్నూల్‌కు మోదీ.. భారీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు

ABN, Publish Date - Mar 16 , 2024 | 07:18 AM

హైదరాబాద్: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి నాగర్‌కర్నూల్‌ జిల్లాకు శనివారం రానున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నాగర్‌కర్నూల్‌కు వస్తున్నారు. దాంతో వెలమ సంఘం కల్యాణ మండపం పక్కన భారీ బహిరంగ సభ నిర్వహణకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తొలిసారి నాగర్‌కర్నూల్‌ జిల్లాకు శనివారం రానున్నారు. లోక్‌సభ (Lok Sabha) ఎన్నికల ప్రచారం (Election Campaign)లో భాగంగా ఆయన నాగర్‌కర్నూల్‌ (Nagarkurnool)కు వస్తున్నారు. దాంతో వెలమ సంఘం కల్యాణ మండపం పక్కన భారీ బహిరంగ సభ నిర్వహణకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు (Elleni Sudhakar Rao) ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. మోదీ తొలిసారి నాగర్‌కర్నూల్‌కు వస్తున్నందున భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని బీజేపీ నాయకులు (BJP Leaders) నిర్ణయించారు. అందుకోసం సభకు ఉమ్మడి జిల్లా, బీజేపీ పట్టు ఉన్న ప్రాంతాల నుంచే కాకుండా మిగతా నియోజకవర్గాల నుంచి కూడా జనాన్ని తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. మోదీ రాక సందర్భంగా సభ ఏర్పాట్లను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna). ఎంపీ రాములు (MP Ramulu). జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి (Loknath Reddy) జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ఆచార్య (Acharya). బంగారు శృతి (Bangaru Shruthi) పరిశీలించారు.

మోదీ పర్యటన ఇలా..

హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేశారు. శనివారం ఉదయం 10:30 గంటల వరకు ప్రత్యేక హెలికాప్టర్‌లో నాగర్‌కర్నూల్‌కు చేరుకుంటారు. ఆయన బహిరంగ సభ అనంతరం 11:45 గంటలకు తిరిగి హైదరాబాద్‌ వెళ్తారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. అయితే పార్టీ టికెట్లు దక్కనందున ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన జితేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి మోదీ సభకు హాజరవుతారా? లేదా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది.

లక్ష మంది జన సమీకరణే లక్ష్యం

మోదీ సభకు లక్ష మందిని జన సమీకరణ చేసేలా పార్టీ అగ్ర నాయకులు వ్యూహరచన చేశారు. కొల్లాపూర్‌ చౌరస్తా సమీపంలోని వెలమ సంఘం కల్యాణ మండపం సమీపంలో గల దాదాపు 15 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేశారు. ఎండలు ముదిరిన నేపథ్యంలో సభకు వచ్చే ప్రజల కోసం భారీ టెంట్లు ఏర్పాటు చేశారు. దాదాపు వంద మంది కూర్చొనేలా సభా వేదికను నిర్మించారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌లోని అచ్చంపేట, కొల్లాపూర్‌, కల్వకుర్తి, గద్వాల, అలంపూర్‌, వనపర్తి నియోజకవర్గాల నుంచే కాకుండా మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నుంచి కూడా భారీగా జనాన్ని సమీకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గం నుంచి 10 వేల నుంచి 15 వేల మంది యువతీ యువకులను తరలించేలా వ్యూహ రచన చేశారు. సామాన్య, మధ్య తరగతి ప్రజానీకానికి కూడా సభకు రప్పించగలిగితే లోకసభ ఎన్నికల్లో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్న పార్టీ అగ్రనాయకత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేసింది. సభ సజావుగా సాగేందుకు స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూపునకు చెందిన సిబ్బంది సభా వేదిక, ప్రాంగణాన్ని గురువారం ఉదయం నుంచే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రత్యేక పోలీస్‌ బలగాలను మోహరించారు. బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలు కూడా రంగంలోకి దిగాయి.

Updated Date - Mar 16 , 2024 | 07:18 AM

Advertising
Advertising