ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నల్లమలలో వేగంగా పర్యాటక అభివృద్ధ్ది

ABN, Publish Date - Dec 22 , 2024 | 11:55 PM

నల్లమలలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని మా ప్రభుత్వం వేగవంతం చేస్తోందని రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్‌ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి అన్నారు.

ఎమ్మెల్యేతో కలిసి విలేకరులతో మాట్లాడుతున్న రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్‌ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి

అచ్చంపేట, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): నల్లమలలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని మా ప్రభుత్వం వేగవంతం చేస్తోందని రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్‌ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణతో కలిసి నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలంలోని ఉమా మహేశ్వరిడిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడు తూ నల్లమల ప్రాంతంలో ఉన్న పర్యాటక ప్రాంతాలను ఇప్పుటి కే గుర్తించమన్నారు. జిల్లా పర్యాటక శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఎమ్మేల్యే బృందం ఈ ప్రాంతంలో పర్యటించి అభివృద్ధికి కావాల్సి న విదివిధాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయించి నల్లమలను పార్యటక హబ్‌గా మారుస్తామన్నారు. అనంతరం ఉమామహేశ్వర కొండపైకి మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు పైపులైన్‌ పనులకు బోగమహేశ్వరంలో ఎమ్మేల్యే వంశీకృష్ణ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ భీరం మాధవరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ హేమలత, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రాజేందర్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అంతటి రజిత తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 11:55 PM