సమస్యలు పరిష్కరించాలని వినతి
ABN, Publish Date - Dec 26 , 2024 | 11:39 PM
పట్టణంలోని ఏనుగొండ వార్డు ప ర్యటనకు వెళ్లిన మునిసిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్‌కు గురువారం కాలనీ ప్రజలు వినతిపత్రం అందజేశారు.
మహబూబ్‌నగర్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఏనుగొండ వార్డు ప ర్యటనకు వెళ్లిన మునిసిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్‌కు గురువారం కాలనీ ప్రజలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లా డుతూ పురపాలికలోని అన్ని వార్డుల్లో ప్రస్తుతం సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు జరుగు తున్నాయని, ఇటీవల కౌన్సిల్‌లో రూ.42 కోట్ల పనులకు ఆమోదం తెలిపామన్నారు. త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయన్నారు. మళ్లీ వా ర్డులలో తిరిగి అవసరమైన పనులను గుర్తించి ప్రతిపాదనలు తయారుచేస్తున్నామని, చెప్పారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌గౌడ్, రమేష్, పురుషో త్తం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2024 | 11:40 PM