శక్తిపీఠం సేవలు అద్భుతం
ABN, Publish Date - Dec 20 , 2024 | 11:21 PM
నారాయణపేట శక్తిపీఠం సేవలు అద్భుతమని జ పాన్ భక్తురాలు మీహో అన్నారు.
- జపాన్ భక్తురాలు మీహో
నారాయణపేట, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట శక్తిపీఠం సేవలు అద్భుతమని జ పాన్ భక్తురాలు మీహో అన్నారు. శుక్రవారం జపాన్‌కు చెందిన భక్తురాలు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు జపాన్ నుంచి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాంఘీక మాధ్యమాల ద్వారా శక్తి పీఠం చేసే అనేక ధార్మిక కార్యక్రమాలు చూసి ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు వచ్చామన్నారు. శక్తిపీఠాన్ని సందర్శించిన అనంతరం వ్యవస్థాప కుడు స్వామి శాంతనందస్వామిని దర్శించుకొని ఆశీర్వాదం పొందారు. జపాన్ భక్తురాలు మీహోకు అమ్మవారి చిత్రపటాన్ని అందించారు. జపాన్‌లో శక్తిపీఠం ఆశ్రమాన్ని ఏర్పాటుచేసేందుకు అనుమతినిస్తే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తామని స్వామిజీని జపాన్ భక్తురాలు కోరారు.
Updated Date - Dec 20 , 2024 | 11:21 PM