కాచిగూడ టు పుదుచ్చేరి రైలులో పొగలు
ABN, Publish Date - Dec 22 , 2024 | 11:49 PM
కాచిగూడ నుంచి పుదుచ్చేరికి వెళ్లే రైలులోని ఓ బోగీ కింది భాగం లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగలు వచ్చా యి.
- గద్వాల స్టేషన్లో నిలిపివేత: ప్రయాణికుల దింపివేత
గద్వాల క్రైం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): కాచిగూడ నుంచి పుదుచ్చేరికి వెళ్లే రైలులోని ఓ బోగీ కింది భాగం లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగలు వచ్చా యి. దీంతో గద్వాల స్టేషన్లో రైలును నిలిపివేసి, సమస్యను గుర్తించి, మరమ్మతు చేశారు. ఇందుకు సంబంధించి రైల్వే అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. కాచిగూడ నుంచి పుదుచ్చేరికి వెళ్లే రైలు గద్వాల స్టేషన్‌ను సమీ పిస్తుండగా, బీ-4 కోచ్ కింది భాగం నుంచి ఒక్కసారిగా పెద్దఎత్తున పొగలు వచ్చాయి. అప్రమత్తమైన రైల్వే అధికారులు స్టేషన్లో రైలును నిలిపివేసి, ప్రయాణికులను కిందికి దించారు. కోచ్ కింది భాగంలో ర బ్బర్లు కాలిపోవడం వల్ల పొగలు వచ్చినట్లు గుర్తించారు. వాటిని తొల గించి కొత్తవి వేశారు. ఆ తర్వాత ప్రయాణికులను రైలు ఎక్కించారు. ఈ సంఘటన వల్ల గద్వాల స్టేషన్ నుంచి రాత్రి 7.40 గంటలకు బయలు దేరాల్సిన రైలు రాత్రి 9.05 గంటలకు బయలు దేరిందని రైల్వే ఎలక్రికల్ అధికారి శంకర్ తెలిపారు. రైలు కర్నూల్‌కు చేరుకునే వరకు సిబ్బంది పరిస్థితిని గమనిస్తూ ఉంటారని తెలిపారు.
Updated Date - Dec 22 , 2024 | 11:49 PM