ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమ్మవారి సొమ్ము తింటే ఆగమే

ABN, Publish Date - Dec 26 , 2024 | 11:41 PM

ఉ మ్మడి పాలమూరు జిల్లాలో అత్యంత పవిత్రమైన మైసమ్మ అమ్మవారి సొమ్ము తింటే ఆగమైపోతార ని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి 8 ఆలయ భూమి కోసం అసెంబ్లీలో చర్చించా

- ప్రజలకు పాలకులు ఆదర్శంగా ఉండాలి

- మైసమ్మ ఆలయ చైర్మన్‌ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి

నవాబ్‌పేట, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఉ మ్మడి పాలమూరు జిల్లాలో అత్యంత పవిత్రమైన మైసమ్మ అమ్మవారి సొమ్ము తింటే ఆగమైపోతార ని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి అన్నారు. అం దుకే జగన్మోహన్‌ రెడ్డి లెక్కలు అడిగినందుకే గత పాలకులు ఆయనను పదవి నుంచి తొలగించా రని, అలాంటి నిజాయితీపరుడైన నాయకుడికి మ ళ్లీ పదవి ఇస్తే కొందరు అలకబూనడం సమంజ సం కాదని అన్నారు. గురువారం మండలంలోని పర్వతాపూర్‌ మైసమ్మ ఆలయ నూతన చైర్మన్‌ జగన్మోహన్‌ రెడ్డి పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో దుశ్యంత్‌ రెడ్డి, మండల అధ్యక్షుడు నీరటి రాంచంద్రయ్య, దేపల్లి వెంకటేష్‌ గౌడ్‌, ఆళ్ల భూపాల్‌ రెడ్డి, బంగ్ల రవి, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ తులసిరాం, వాసుయాదవ్‌, హమీద్‌ మహేక్‌, బో వొళ్ల రాజశేఖర్‌తో కలిసి చైర్మన్‌ సభ్యులతో ప్రమాణ స్వీకారం చే యించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ గతంలో ఆలయానికి ఎవరైనా వస్తే అమ్మవారి సొమ్ము తో సన్మానాలు, ఇతర కార్యక్ర మాల పేరుతో ఆలయ సొమ్ము వృథా చేశారని, ఇప్పుడు అలాం టి పరిస్థితి ఉండరాదన్నారు. ఆలయ అభివృద్ధి కోసం ఐదు ఎకరాలు కేటాయించాలని ఇటీ వల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో చర్చించామని, త్వరలో సమస్య పరిష్కారం చేస్తానన్నారు. తాను ఎన్నికల సమయంలో అమ్మవారికి రూ.కోటి చెల్లిస్తానని మొక్కి పాదయాత్ర చేశాన ని, తన మొక్కు చెల్లించే క్రమంలో అమ్మవారికి బాకీ పడ్డానని... త్వరలో చెల్లిస్తానని తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు, మంత్రి జూపల్లి కృష్ణారావునుఆలయానికి తీసుకు వచ్చే బాధ్యత తనదన్నారు. జడ్చర్ల నియోజకవ ర్గం ప్రజలు ముడాకు పన్నుల రూపంలో డ బ్బులు చెల్లిస్తే మనకు రావాల్సిన రూ.30 కోట్లు ఎందుకు తీసుకురాలేదో గత ఎమ్మెల్యే చెప్పాలన్నా రు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు తెలంగాణ ప్రజలకు సముచిత స్థానం ఇవ్వకపోతె తాము ఇక్కడ తమ పని చేస్తామన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కోసం పని చేయడమే తమ లక్ష్యమన్నారు. ఈవో మదనేశ్వర్‌ రెడ్డి, నాయకులు అల్వాల్‌ రెడ్డి, బుక్క వెంకటేష్‌, కత్తెర కృష్ణయ్య, బోవొళ్ల రాజశేఖర్‌, రవీందర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, రమేష్‌ గౌడ్‌, మార్కెట్‌ డైరెక్టర్లు కామారం ప్రభా కర్‌, జమీరొద్దీన్‌, శివకుమార్‌, దుబ్బ రవికిరణ్‌, పద్మమ్మ, కటమయ్య, రియాజ్‌, సున్నాల క్రిష్ణయ్య, మాధవులు, సూరి, శ్రీను, శ్రీహరి, పుట్టి శ్రీను, అంజన్‌కుమార్‌, లోకిరేవు సురేందర్‌, మరికంటి రాజు, కిషన్‌ నాయక్‌, పుల్య నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2024 | 11:41 PM