న్యాయవాదుల దీక్షకు గట్టు ప్రజల మద్దతు
ABN, Publish Date - Dec 25 , 2024 | 11:11 PM
న్యాయవాదులు చేస్తున్న దీక్షలకు గ ట్టు మండలప్రజలు సంఘీభావం తెలిపారు.
గద్వాల క్రైం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని కోర్టు ఎదురుగా కొన్నిరోజుల నుంచి నూతన కోర్టు సముదాయం కోసం చేస్తున్న నిరసన దీక్షలు తారాస్థాయికి చేరుతున్నా అధికారుల్లో ఏమాత్రం చలనంలేకుండా పోయిం ది. బుధవారం న్యాయవాదులు చేస్తున్న దీక్షలకు గ ట్టు మండలప్రజలు సంఘీభావం తెలిపారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ అందరికీ అనుగుణంగా ఉండే పీజేపీ క్యాంపులోనే నూత న కోర్టు సముదాయం ఏర్పాటు చేయాలని కోరా రు. ఈ విషయంపై అధికారులు స్పందించి వెం టనే చర్యలు తీసుకోవాలన్నారు.
Updated Date - Dec 25 , 2024 | 11:11 PM