విద్యార్థినులు సమస్యలుంటే చెప్పాలి
ABN, Publish Date - Dec 19 , 2024 | 11:18 PM
పాఠశాలల్లో నెలకొన్న స మస్యలను రాతపూర్వకంగా తెలియజే యాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గంట కవితా దేవి విద్యార్థినుల కు సూచించారు.
న్యాయ సేవాధికార సంస్థ గద్వాల జిల్లా కార్యదర్శి గంట కవితాదేవి
గద్వాల టౌన్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో నెలకొన్న స మస్యలను రాతపూర్వకంగా తెలియజే యాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గంట కవితా దేవి విద్యార్థినుల కు సూచించారు. గురువారం పట్టణం లోని బురదపేట ప్రభుత్వ ఉన్నత పాఠ శాలను గంట కవితాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాలలో మ ధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీ లించారు. మెనూప్రకారం భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. పాఠశాల ఆవరణ ను పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. అనంతరం గంట కవితాదేవి మాట్లా డుతూ విద్యార్థినులు అందరూ క్రమశిక్షణతో మె లగాలని, ప్రణాళికాబద్ధంగా చదవి మంచి మా ర్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నారు. మూత్రశాల గదుల సౌకర్యం సరిగ్గాలేదని, పాఠశాల ఆవర ణలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా ఉం దని విద్యార్థినుల తల్లిదండ్రులతో పాటు బురద పేటవాసులు అధికారి దృష్టికి తెచ్చారు. ఈ విష యంపై సంబంధిత అధికారులకు తగు సూచన లు చేస్తామని విద్యార్థినులకు, ఉపాధ్యాయులకు తెలిపారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే రాత పూర్వకంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందజేయాలని సూచించారు.
Updated Date - Dec 19 , 2024 | 11:18 PM