బోనస్ నగదును రైతుల ఖాతాలో జమ చేయాలి
ABN, Publish Date - Dec 21 , 2024 | 11:18 PM
కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించి క్వింటాల్‌కు రూ.500 బోనస్ నగదును రైతుల ఖాతాలో వెంటనే జమ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి
గద్వాల టౌన్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించి క్వింటాల్‌కు రూ.500 బోనస్ నగదును రైతుల ఖాతాలో వెంటనే జమ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేం ద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. నగదు జమ చేయ కపోవడంతో రైతులు ప్రభుత్వ అధికారులు, కా ర్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్ప డిందన్నారు. జిల్లాలో అధికార పార్టీ నాయకుల మధ్య ఉన్న విబేధాలతో కృత్రిమ ఇసుక కొరత సృష్టిస్తున్నారని, దీంతో నిర్మాణ రంగా కార్మికుల కు ఉపాధి లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని కో ర్టు సముదాయాల నిర్మాణానికి సంబంధించి ప్ర భుత్వం, జిల్లా అధికార యంత్రాంగం జోక్యం చేసుకుని తక్షణమే సమస్యను పరిష్కరిం చాలన్నారు. సమావేశంలో రాజు, నర్సింహ, మద్ది లేటి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 21 , 2024 | 11:18 PM