రెసిడెన్షియల్ విద్యార్థులకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే
ABN, Publish Date - Dec 24 , 2024 | 11:53 PM
బీచుపల్లి రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థు లకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మంగళవారం సంఘీభావం తెలిపారు.
గద్వాల న్యూటౌన్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): బీచుపల్లి రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థు లకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మంగళవారం రోడ్డుపై సంఘీభావం తెలిపారు. వారి సమస్యను పరిష్కరించేలా చూడాలని కలెక్టర్‌కు ఫోన్‌లో సూచించారు. ఎర్రవల్లి మండలం బీచుపల్లి రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని కోరుతూ బీచుపల్లిలోని పాఠశాల నుంచి నుంచి గద్వాల కలెక్టరేట్ వరకు సుమారు 20కిలోమీటర్లు నడిచి వెళ్తున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వ్యక్తిగత పనుల మీద పెబ్బేరు కు వెళుతూ మార్గమధ్యలో విద్యార్థులను కలిసి మాట్లాడారు. సమస్యలు తెలుసుకున్నారు.
Updated Date - Dec 24 , 2024 | 11:53 PM