ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాజ్యాంగాన్ని దేశ ప్రజలే రక్షించాలి

ABN, Publish Date - Dec 22 , 2024 | 11:48 PM

దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని దేశ ప్రజలే రక్షించాలని నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి అన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ మల్లు రవి, పక్కన ఎమ్మెల్యే మేఘారెడ్డి

- నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి

- అమిత్‌షాను క్యాబినెట్‌ నుంచి తప్పించాలి : ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి అర్బన్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని దేశ ప్రజలే రక్షించాలని నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి విలేకరుల సమావేశం లో మాట్లాడారు. పార్లమెంట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్‌ పట్ల చేసిన వ్యాఖ్యలు అవమాన కరంగా ఉన్నాయని మండిపడ్డారు. రాజ్యాం గ కమిటీ చైర్మన్‌ అయిన అంబేడ్కర్‌ను అవమానపరిచారంటే ప్రజాస్వామ్యాన్ని, దేశ ప్రజలను కించపరిచినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అమిత్‌షాను క్యాబినెట్‌ నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. నేడు నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాలలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వను న్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ... అంబేడ్కర్‌ పట్ల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్య లను తీవ్రంగా ఖండించినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రేవంత్‌రెడ్డి ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేశారని తెలిపారు. ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసిన, ఇచ్చిన మాట మేరకు హామీలు నెరవేరుస్తామని తెలిపా రు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్‌ విష్ణు వర్ధన్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ పుట్టపాకల మహేష్‌, డీసీసీ డెలిగేట్‌ మెంబర్‌ శంకర్‌ ప్రసాద్‌, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ పాకనాటి కృష్ణయ్య, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 11:48 PM