జిల్లా ఖ్యాతిని చాటాలి
ABN, Publish Date - Dec 26 , 2024 | 11:24 PM
గద్వా ల జిల్లా ఖ్యాతిని చాటి చెప్పే విధంగా కబడ్డీ రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించాలని బీజే పీ పట్టణ అధ్యక్షుడు బండ ల వెంకట్రాములు అన్నారు.
బీజేపీ పట్టణ అధ్యక్షుడు బండల వెంకట్రాములు
గద్వాల అర్బన్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): గద్వా ల జిల్లా ఖ్యాతిని చాటి చెప్పే విధంగా కబడ్డీ రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించాలని బీజే పీ పట్టణ అధ్యక్షుడు బండ ల వెంకట్రాములు అన్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ డీకే స్నిగ్దారెడ్డి ఆదే శానుసారం గురువారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియం గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయ న ముఖ్యఅతిథిగా హాజరై క్రీడాకారులకు జెర్సీలను అందజేశారు. ఈ సందర్భం గా బండల వెంకట్రాములు మాట్లాడుతూ జనగామ జిల్లాలో నిర్వహించే 50వ జూనియర్స్ బాలుర కబడ్డీ స్టేట్ టోర్నమెంట్‌కు బయలు దేరుతున్న జట్టుకు శుభాకాం క్షలు తెలిపారు. అనంతరం పోటీల్లో విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ కన్వీనర్ డి. అబ్రహం, కబడ్డీ కోచ్ తిరుపతి, మేనేజర్ కొత్త సురేష్, సర్వేశ్వర్‌రెడ్డి, నరసింహ, నాగేష్, చందు, రవి ఉన్నారు.
Updated Date - Dec 26 , 2024 | 11:24 PM