ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యేసు బోధనలు భావితరాలకు అందించాలి

ABN, Publish Date - Dec 25 , 2024 | 11:49 PM

యేసు ప్రభువు బోధనలను భావితరాలకు అందించాలని మహబూ బ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

కేక్‌ కట్‌ చేస్తున్న ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి

- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి

- ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

- ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన పాస్టర్లు

- పలు చర్చిల ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

- కల్వరి ఎంబీ చర్చిలో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): యేసు ప్రభువు బోధనలను భావితరాలకు అందించాలని మహబూ బ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బుధవారం క్రిస్మస్‌ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి చర్చిలలో పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని క్రిస్టియన్‌పల్లిలోని బెత్లెహేమ్‌ చర్చి, మోతీనగర్‌లోని బెత్తేస్థ హోలీ చర్చిలలో నిర్వహించిన ప్రార్థనలలో ఆయన పాల్గొ న్నారు. ఎంబీసీ చర్చిలో నిర్వహించిన ప్రార్థనలలో ఎంపీ డీకే అరు ణతో కలిసి ఆయన పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్‌ కేక్‌ను కట్‌ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. అనం తరం ఎమ్మెల్యే మాట్లాడుతూ యేసుక్రిస్తు బోధనలు నిస్వార్థ జీవ నానికి నిదర్శనమన్నారు. గతంలో ఎన్నో విద్యా సంస్థలు ఎంబీ చర్చి ఆధ్వర్యంలో నిర్వహించి ఎందరికో విద్యను అందించారన్నారు. ఈ ప విత్ర క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా మరిన్ని విద్యాసంస్థలు ఏర్పాటు చేసి నిరుపేదలకు విద్యను అందించాలని ఆయన కోరారు. అందుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. నిజాం సం స్థానంలో నాడు ఏర్పడిన సెయింట్‌ జార్జెస్‌ పాఠశాలలోనే తాను వి ద్యా భ్యాసం చేశానన్నారు. అక్కడి పాస్టర్లు అందించిన ప్రోత్సాహం, సహ కారం ఎంతో గొప్పదన్నారు. ఎంపీ అరుణ పండుగ శుభాకాం క్షలు తెలుపుతూ యేసు మార్గం అనుసరణీయమన్నారు. కార్యక్రమంలో రెవరెండ్‌ వరప్రసాద్‌, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌ కుమార్‌, ఏపీ మిథున్‌ రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌ కుమార్‌ గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ షబ్బీర్‌ అహ్మద్‌, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌ యాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ బెక్కరి అనితారెడ్డి, వైస్‌ చైర్మన్‌ పెద్ధి విజయ్‌ కుమార్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ ఖాద్రి,బెత్తేస్థ హోలీ చర్చి పాస్టర్‌ పృద్వీరాజ్‌, బెత్లేహమ్‌ ఎంబీ చర్చి ప్రతినిధులు ఆర్‌.వరప్రసాద్‌, ప్రేమ్‌కుమార్‌, ఆబ్రహం, శరత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 11:49 PM