ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాజకీయాలలో వాజపేయి అజాతశత్రువు

ABN, Publish Date - Dec 25 , 2024 | 11:30 PM

మాజీ ప్రధాని దివంగత అటల్‌ బిహారీ వాజ పేయి దేశ రాజకీయాలలో అజాత శత్రువు అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ అన్నారు.

జిల్లా కేంద్రంలో వాజ్‌పేయి చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న నాయకులు

వనపర్తి అర్బన్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని దివంగత అటల్‌ బిహారీ వాజ పేయి దేశ రాజకీయాలలో అజాత శత్రువు అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ అన్నారు. బుఽ దవారం వాజపేయి శత జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాం గణంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆసుపత్రిలో రోగు లకు పండ్లు పంపిణీ చేశారు. ఓబీసీ మోర్చా అధి కార ప్రతినిధి శ్రీశైలం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాజపేయి ఆశయ సాధన కోసం ప్రధాని నరేంద్రమోడీ ఎంతో కృషి చేస్తు న్నారని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కా ర్యవర్గ సభ్యుడు సబ్బిరెడ్డి వెంకట్‌రెడ్డి, పురు షోత్తంరెడ్డి, రాజ శేఖర్‌ గౌడ్‌, సూపర్‌ రాములు తదితరు లు పాల్గొన్నారు.

అమరచింత: మాజీ ప్రధాని అట ల్‌ బిహారీ వాజ పేయి జయంతిని బుధవారం పట్ట ణంలో బీజేపీ ఆధ్వ ర్యంలో నిర్వహిం చారు. ఈ సందర్భంగా చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ.. వాజపేయి ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి వ్యక్తి హృదయంలో చిరస్థాయిగా నిలిచాడని కొనియాడారు. ఈ సందర్భంగా ఆసుపత్రులలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమం లో పట్టణ అధ్యక్షుడు క్యామ భాస్కర్‌, మేర్వ రాజు, మరాఠి అశోక్‌ కుమార్‌, నర్సింహులు గౌడ్‌, గొల్ల శ్రీనివాస్‌, నరాల సిద్దు, మేర్వ అనిల్‌, పాండు తదితరులు పాల్గొన్నారు.

ఖిల్లాఘణపురం: దేశంలో స్వార్థమెరుగని రాజనీతిజ్ఞుడు మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి అని బీజేపీ మండల అధ్యక్షుడు బుచ్చిబాబు గౌడ్‌ తెలిపారు. మండల కేంద్రంలోని బస్టాండ్‌ ఆవరణంలో శత జయంతి ఉత్సవాల్లో భాగంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. విక్రమ్‌, ఆశన్న, రవి నాయక్‌, శివశంకర్‌, సత్యనారాయణ, రామ చందర్‌, ఈదమ్మ, గోపి తదితరులు పాల్గొన్నారు.

కొత్తకోట: పట్టణ చౌరస్తాలో బీజేపీ నా యకులు వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కౌన్సిలర్‌ భరత్‌ భూషణ్‌, వెంకట్‌రెడ్డి, సాయిరాం, రాఘవేందర్‌ గౌడ్‌, రాఘవేందర్‌రెడ్డి, లచ్చాగౌడ్‌, బాలు, ర మేష్‌చారి, మొగిలి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 11:30 PM