ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి

ABN, Publish Date - Dec 19 , 2024 | 11:50 PM

ఉమ్మడి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మంత్రులు మద్ధతు తెలిపినట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న చిన్నారెడ్డి

  • వనపర్తిలో ఐటీ టవర్‌కు రూ.22 కోట్లు మంజూరు

  • రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి

వనపర్తి అర్బన్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మంత్రులు మద్ధతు తెలిపినట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. గురువారం వనపర్తి పట్టణంలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు, విద్య, వైద్యం, వ్యవసా యం, నిరుద్యోగంపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. దీనికి గాను ఏడాదికి రూ.20వేల కోట్ల చొప్పున మొత్తం ఒక లక్ష కోట్ల రూపాయలతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అభివృద్ధి పనులు చేసేందుకు ఖర్చు పెట్టబోతున్నార ని తెలిపారు. వనపర్తి పట్టణ సమీపంలో ఐటీ టవర్‌ నిర్మాణానికి రూ.22 కోట్లు మంజూరైనట్లు చిన్నారెడ్డి తెలిపారు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులు, పెండింగ్‌ ప్రాజెక్టులు, వాటి కింద సాగు వివరాలను ముఖ్యమంత్రికి అందజేసేందుకు సిద్ధం చేసిన ట్లు తెలిపారు. పది ఏళ్లలో ఉమ్మడి జిల్లాను గత ప్రభుత్వం పట్టించుకో లేదని, అందుకే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని ఆ పార్టీని తరిమికొట్టి కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం ఇచ్చారని తెలిపారు. అనంతరం అంబేడ్కర్‌ చౌరస్తాలో కేంద్ర మంత్రి అమిత్‌షా దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌, నాయకులు రాగివేణు, కోళ్ల వెంకటేష్‌, బాబా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 19 , 2024 | 11:50 PM