ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Manda Krishna: 9 కాదు.. 90 మందిని గుర్తించాలి

ABN, Publish Date - Dec 15 , 2024 | 05:10 AM

తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది కవులు, కళాకారులు పాల్గొనగా వారిలో కేవలం 9 మందిని మాత్రమే ఎంపిక చేయడంలో ఆంతర్యం ఏమిటని ఎమ్మార్పీఎస్‌ అధినేత మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు.

  • పేద ఉద్యమ కళాకారులను సీఎం మర్చిపోయారు

  • ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

బర్కత్‌పుర, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది కవులు, కళాకారులు పాల్గొనగా వారిలో కేవలం 9 మందిని మాత్రమే ఎంపిక చేయడంలో ఆంతర్యం ఏమిటని ఎమ్మార్పీఎస్‌ అధినేత మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. 9 మందిని కాదు 90 మంది ఉద్యమ కళాకారులను గుర్తించాలని డిమాండ్‌ చేశారు. శనివారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మందకృష్ణ మాట్లాడారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో రేవంత్‌ రెడ్డి పాల్గొనక పోవడం వల్లనే నిజమైన కళాకారులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కమిటీ లేకుండా కళాకారుల ఎంపిక జరిగిందని ఆరోపించారు.


దళిత మాదిగ కళాకారులను సీఎం మర్చిపోయారని విమర్శించారు. ప్రభుత్వం గుర్తించిన 9 మంది కళాకారులలో ఒక్క మహిళా లేదన్నారు. అయితే ఒక్కొక్క కళాకారుడికి 300 గజాల ఇంటి స్థలం, కోటి రూపాయలు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇకనైనా నిజమైన కళాకారులను గుర్తించకపోతే ప్రభుత్వంతో యుద్ధం చేస్తామని మందకృష్ణ హెచ్చరించారు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి రూపాన్ని ఆమోదించబోమన్నారు.

Updated Date - Dec 15 , 2024 | 05:10 AM