ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ములుగు జిల్లాలో మావోయిస్ట్ లేఖ కలకలం..

ABN, Publish Date - Apr 06 , 2024 | 08:27 PM

ములుగు జిల్లాలో మావోయిస్ట్ లేఖ కలకలం సృష్టించింది. తెలంగాణ - ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు కాంకేర్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను మావోయిస్ట్ పార్టీ ఖండించింది. పూజార్ - కాంకేర్ ఎన్‌కౌంటర్ మృతులకు మావోయిస్ట్ పార్టీ జోహార్లు అర్పించింది.

ములుగు, ఏప్రిల్ 06: ములుగు జిల్లాలో మావోయిస్ట్ లేఖ కలకలం సృష్టించింది. తెలంగాణ - ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు కాంకేర్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను మావోయిస్ట్ పార్టీ ఖండించింది. పూజార్ - కాంకేర్ ఎన్‌కౌంటర్ మృతులకు మావోయిస్ట్ పార్టీ జోహార్లు అర్పించింది. ములుగు జిల్లా ఎస్పీ కనుసన్నల్లోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని ఆరోపించింది.

ఈ ఎన్‌కౌంటర్‌కు ములుగు ఎస్పీ పూర్తి బాధ్యత వహించాల్సి ఉందని స్పష్టం చేసింది. నెత్తుటి భాకీ తప్పకుండా తీర్చుకుంటామని ఈ సందర్భంగా ప్రకటించింది. ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ పోలీసులు రాజ్యహింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు. డ్రోన్లు, హెలికాఫ్టర్ల ద్వారా ఆకాశ మార్గం నుంచి దాడులకు తెగబడుతున్నారని తెలిపింది. ఈ మేరకు బీ.కే.ఏ.ఎస్.ఆర్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరిట మావోయిస్ట్ పార్టీ ఈ లేఖను విడుదల చేసింది.

తెలంగాణ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 06 , 2024 | 08:27 PM

Advertising
Advertising