మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Crime.. సంగారెడ్డి జిల్లా: యువతి అదృశ్యం..

ABN, Publish Date - Apr 10 , 2024 | 10:13 AM

సంగారెడ్డి జిల్లా: పెండ్లి బట్టలు కొనేందుకు వచ్చిన ఓ యువతి అదృశ్యమైంది. సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్‌కు చెందిన మౌనిక (20) అనే యువతికి ఈ నెల 15వ తేదీన వివాహం చేసేందుకు కుటుంబ పెద్దలు నిర్ణయించారు.

Crime.. సంగారెడ్డి జిల్లా:  యువతి అదృశ్యం..

సంగారెడ్డి జిల్లా: పెండ్లి బట్టలు కొనేందుకు వచ్చిన ఓ యువతి అదృశ్యమైంది (Young Woman Disappeared). సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్‌కు చెందిన మౌనిక (20) (Mounika) అనే యువతికి ఈ నెల 15వ తేదీన వివాహం (Marriage) చేసేందుకు కుటుంబ పెద్దలు నిర్ణయించారు. అందులో భాగంగా పెళ్లి బట్టలు కొనేందుకు ఆమె పటాన్ చెరు మండలం, ముత్తంగిలో తన బాబాయ్ సాయిలు వద్దకు వచ్చింది. షాపింగ్ (Shopping) పని పూర్తి అయ్యాక బాబాయ్ సాయిలు నారాయణఖేడ్ బస్సు ఎక్కించగా.. మౌనిక ఇంటికి వెళ్లలేదు. ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో యువతి తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ.. చుట్టుప్రక్కల ఆమె కోసం విచారణ చేశారు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Apr 10 , 2024 | 10:18 AM

Advertising
Advertising