ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kotha Prabhakar Reddy: బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడొద్దు

ABN, Publish Date - Jan 02 , 2024 | 04:22 PM

పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజల వసరాలు తీర్చేలా పని చేస్తానని దుబ్బాక బీఆర్ఎస్ ( BRS ) ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ( Kotha Prabhakar Reddy ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు దుబ్బాకలో బీఆర్ఎస్ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ... 54 వేల మెజార్టీతో తనను గెలిపించి తన మీద చాలా బాధ్యత పెట్టారని కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారు.

సిద్దిపేట: పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజల వసరాలు తీర్చేలా పని చేస్తానని దుబ్బాక బీఆర్ఎస్ ( BRS ) ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ( Kotha Prabhakar Reddy ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు దుబ్బాకలో బీఆర్ఎస్ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ... 54 వేల మెజార్టీతో తనను గెలిపించి తన మీద చాలా బాధ్యత పెట్టారని చెప్పారు. గతంలో అధికారంలో లేకపోయినా హరీశ్‌రావు సిద్దిపేట అభివృద్ధి చేశారని.. అలాగే తాము ఇద్దరం జొడెద్దుల్లా పని చేసి దుబ్బాక, సిద్దిపేటను అభివృద్ధి చేస్తామని చెప్పారు. హరీశ్‌రావును మాజీ మంత్రి అని అనను.. మళ్లీ తాజా మంత్రి అవుతాడన్నారు. ఇది ఎన్నికల సంవత్సరం.. కార్యకర్తలు నిరాశ పడాల్సిన అవసరం లేదని కష్టపడి పార్లమెంట్ ఎన్నికల్లో పని చేద్దామని తెలిపారు. లోకల్ బాడీ ఎన్నికల్లోనూ అందరం కలిసి పని చేసి గెలిపించుకుందామని తెలిపారు. వచ్చేది మన ప్రభుత్వమేనని కార్యకర్తలు అధైర్యపడొద్దని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి భరోసా కల్పించారు.

Updated Date - Jan 02 , 2024 | 04:22 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising