ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: ఏంది బై ఇదీ.. దావత్ అని వెళ్లినందుకు అనుకోని షాక్

ABN, Publish Date - Feb 03 , 2024 | 12:40 PM

Telangana: ఫ్రెండ్స్ అన్నాక దావత్‌‌లు చేసుకోవడం కామన్. పండగొచ్చినా.. పబ్బమొచ్చినా ఫ్రెండ్స్ పార్టీలు చేసుకోవాల్సిందే. స్నేహితులు గ్రూప్‌గా ఏర్పడి పార్టీలు చేసుకుని ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాగే ఓ వ్యక్తి సైతం తన స్నేహితులకు దావత్ ఇచ్చాడు.

సంగారెడ్డి, ఫిబ్రవరి 3: ఫ్రెండ్స్ అన్నాక దావత్‌‌లు చేసుకోవడం కామన్. పండగొచ్చినా.. పబ్బమొచ్చినా ఫ్రెండ్స్ పార్టీలు చేసుకోవాల్సిందే. స్నేహితులు గ్రూప్‌గా ఏర్పడి పార్టీలు చేసుకుని ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాగే ఓ వ్యక్తి సైతం తన స్నేహితులకు దావత్ ఇచ్చాడు. అయితే ఇతను చేసిన పొరబాటు వల్ల భార్య దగ్గర అడ్డంగా బుక్కయ్యాడు. చివరకు ఉరిమి ఉరిమి మంగళంమీద పడ్డట్టు.. దావత్ ఖర్చు తిరిగి ఇవ్వాలని అనడంతో... తోటి స్నేహితుడు భయాందోళనకు గురైన చేసిన పని ఆశ్చర్యానికి గురిచేసింది.

అసలేం జరిగిందంటే.. జిల్లాలోని జోగిపేటలో ఓ యువకుడు సెల్ టవర్‌ ఎక్కి హల్‌ చల్ చేశాడు. జోగిపేటకు చెందిన నర్సింహులు అనే వ్యక్తి... తన ఫ్రెండ్స్‌కు దావత్ ఇచ్చాడు. అయితే భార్యకు తెలీకుండా ఇంట్లో నుంచి రూ.20 వేలు తీసుకెళ్లి మరీ స్నేహితులకు నర్సింహులు దావత్ ఇచ్చాడు. ఇంట్లో డబ్బులు మాయంపై భార్య నిలదీయగా అసలు విషయం బయటపడింది. దీంతో సదరు భార్య వెంటనే భర్త స్నేహితుడు మహేష్‌కు ఫోన్ చేసి దావత్ ఇచ్చిన డబ్బులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేకపోతే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరించింది. భయాందోళనకు గురైన మహేష్... సెల్‌టవర్ ఎక్కి తోటి స్నేహితులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. వెంటనే అక్కడకు చేరుకున్న తోటి స్నేహితులు, పోలీసులు కలిసి అక్కడకు చేరుకున్నారు. ఎలాగోలా నచ్చజెప్పి మహేష్‌ను కిందకు దించడంతో కథ సుఖాంతమైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 03 , 2024 | 01:13 PM

Advertising
Advertising