TS Politics: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. ఆ కీలక నేత రాజీనామా.. ఏ పార్టీలో చేరారంటే..?
ABN, Publish Date - Mar 01 , 2024 | 05:54 PM
పార్లమెంట్ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ (BRS)కు బిగ్ షాక్ తగిలింది. గులాబీ పార్టీకు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్(BB Patil) రాజీనామా చేశారు. ఢిల్లీలోని బీజేపీ(BJP) జాతీయ కార్యాలయంలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో ఎంపీ బీబీ పాటిల్ కాషాయ కండువా కప్పుకున్నారు.
ఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ (BRS)కు బిగ్ షాక్ తగిలింది. గులాబీ పార్టీకు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్(BB Patil) రాజీనామా చేశారు. ఢిల్లీలోని బీజేపీ(BJP) జాతీయ కార్యాలయంలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో ఎంపీ బీబీ పాటిల్ కాషాయ కండువా కప్పుకున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపించారు. ఆయన బీజేపీలో చేరడంతో సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు కేసీఆర్ పార్టీ నుంచి ఎంపీగా బీబీ పాటిల్ గెలుపొందారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ హై కమాండ్‌పై ఆయన అసంతృప్తితో ఉన్నారు. కేసీఆర్ తీరుపై కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాషాయ పార్టీలో చేరితేనే తనకు రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందని భావించిన బీబీపాటిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
బీఆర్‌ఎస్ నుంచి రోజుకో వికెట్: లక్ష్మణ్
కాగా.. బీబీ పాటిల్ బీజేపీలో చేరడంపై ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్(MP Laxman) స్పందించారు. బీబీ పాటిల్ బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నానని లక్ష్మణ్ అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివృద్ధి మోడల్ నచ్చి నేతలు బీజేపీలో చేరుతున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ నుంచి రోజుకో వికెట్ కోల్పోతుందని చెప్పారు. ఆ పార్టీ రెక్కలు తెగిన పక్షిలా తయారైందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు బయటకు కత్తులు దుస్తున్నట్లు నటిస్తూ బీజేపీ బలోపేతాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రెండు పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో బీజేపీ బలోపేతాన్ని అడ్డుకోలేవని చెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి....
MLA Rakesh Reddy: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే దేశం ముక్కలవుతుంది
BJP: 65 శాతం ముస్లింలకు మోదీ పథకాలతో లబ్ది: కొండా విశ్వేశ్వరరెడ్డి
Hyderabad: టెన్షన్ టెన్షన్ తర్వాత.. హైదరాబాద్‌లో సురక్షితంగా ల్యాండైన విమానం
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి....
Updated Date - Mar 01 , 2024 | 06:01 PM