Media Welfare: జర్నలిస్టుల సమస్యలపై త్వరలో సీఎంతో భేటీ
ABN, Publish Date - Aug 30 , 2024 | 04:26 AM
రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ కానున్నట్లు మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివా్‌సరెడ్డి
హుజూర్‌నగర్, ఆగస్టు 29: రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ కానున్నట్లు మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో టీయూడబ్ల్యుజే(ఐజేయూ) ఆధ్వర్యంలో శ్రీనివా్‌సరెడ్డికి ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్‌లో జేఎన్‌జే సొసైటీకి కేటాయించిన 70ఎకరాల స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా గత ప్రభుత్వం పంపిణీ చేయకుండా రెండేళ్ల పాటు కాలయాపన చేసిందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నదని, హైపవర్ కమిటీని ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి ముందడుగు వేశామన్నారు. 10 రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీనివా్‌సరెడ్డితో మరోసారి భేటీ అయి విధి విధానాలపై చర్చించనున్నట్లు తెలిపారు. అక్రిడిటేషన్లు, హెల్త్‌కార్డులు, ఇళ్ల స్థలాలపై త్వరలో సీఎం అధికారిక ప్రకటన చేస్తారని వివరించారు.
Updated Date - Aug 30 , 2024 | 04:27 AM