ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: మేఘా ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయమన్నా పట్టించుకోవడం లేదు

ABN, Publish Date - Aug 20 , 2024 | 10:23 AM

సుంకిశాల ప్రమాదానికి కారణమైన మేఘా ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయమని, ప్రమాదం పైన న్యాయ విచారణ చేయాలని ప్రధాన ప్రతిపక్షంగా డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

హైదరాబాద్: సుంకిశాల ప్రమాదానికి కారణమైన మేఘా ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయమని, ప్రమాదం పైన న్యాయ విచారణ చేయాలని ప్రధాన ప్రతిపక్షంగా డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సుంకిశాల ప్రమాదానికి కారణమైన మేఘా ఇంజనీరింగ్ కంపెనీపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4350 కోట్ల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అప్పజెప్పనున్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మెఘా ఇంజనీరింగ్ కంపెనీని తెలంగాణ సంపద దోచుకు వెళుతున్న ఈస్ట్ ఇండియా కంపెనీగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి.. ఈ రోజు మేఘా సంస్థ పైన ఎందుకింత ఔదార్యం ప్రేమ చూపిస్తున్నారో ప్రజలకు తెలిపాలని కేటీఆర్ అన్నారు. మేఘా ఇంజనీరింగ్ రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆసక్తి పైన ఆంతర్యం ఏంటో ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు.


సుంకిశాల ప్రాజెక్టు సైడ్‌ వాల్‌ (రక్షణ గోడ) కూలిపోయిన ప్రమాద ఘటనకు పూర్తి బాధ్యత తమదేనని నిర్మాణ సంస్థ వాటర్‌ బోర్డుకు ఇంతకు ముందే తెలిపింది. ఈ ఘటనపై ఇంజనీర్ల కమిటీతో వాటర్ బోర్డు విచారణ సైతం జరిపించింది. ఆపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుగుణంగా నిర్మాణ సంస్థకు షోకాజ్‌ నోటీసులు సైతం జారీ చేసింది. దీనికి మూడు పేజీలతో కూడిన వివరణ లేఖను వాటర్ బోర్డుకు నిర్మాణ సంస్థ అందజేసింది. ఈ ఘటన పట్ల సంస్థ విచారం వ్యక్తం చేయడమే కాకుండా ప్రమాదం తలెత్తడానికి గల కారణాలు, లోపాలను పూర్తిగా లేఖలో వివరించినట్లు సమాచారం. దేశ, విదేశాల్లో భారీ ప్రాజెక్టులను చేపడుతున్న తమకు ఈ ఘటన మొదటిదని, అన్నీ రకాల భద్రత చర్యలు చేపట్టినప్పటికీ ప్రమాదం జరగడంపై కారణాలను అంతర్గతంగా విచారణ చేసుకున్నట్లుగా లేఖలో ప్రస్తావించినట్లు తెలిసింది.


సుంకిశాల ఇన్‌టేక్‌ వెల్‌ ప్రాజెక్టు పనుల్లో ఇప్పటి వరకు 60శాతానికి పైగా పూర్తయ్యాయని, పంపింగ్‌ మెయున్‌ పనులు 70శాతం, ఎలక్ర్టో మెకానిక్‌ పనులు 40శాతం పూర్తయినట్లుగా పేర్కొన్నట్లు సమాచారం. అయితే టన్నెల్‌ గేట్‌ ధ్వంసంతో రిజర్వాయర్‌ వైపు గల సైడ్‌ వాల్‌ (రక్షణ గోడ) కూలిపోవడంతో సంపు, పంప్‌ హౌజ్‌ సూపర్‌ స్ట్రక్చర్‌ నిర్మాణానికి ఇబ్బందికరంగా మారిందని, కానీ పంపింగ్‌ మెయిన్‌ పనులు, ఎలక్ర్టో మెకానిక్‌ పనులను ఆపలేదని, చురుగ్గా సాగుతున్నాయని వివరణలో స్పష్టం చేసినట్లుగా తెలిసింది. అయితే సైడ్‌ వాల్‌ కూలిపోవడంతో తలెత్తిన పరిణామాలన్నింటికీ నిర్మాణ సంస్థగా తామే బాధ్యత వహిస్తామని, ఆయా పనుల పునఃనిర్మాణ వ్యయం మొత్తం తామే భరిస్తామని, ప్రమాదం నేపథ్యంతో తాజాగా విధించే గడువుకనుగుణంగా సుంకిశాల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అన్నీ రకాల చర్యలు చేపడతామని లేఖలో నిర్మాణ సంస్థ వివరించినట్టు సమాచారం.

Updated Date - Aug 20 , 2024 | 10:23 AM

Advertising
Advertising
<