Share News

హనుమకొండ ఆస్పత్రిలో ఎలుకల స్వైరవిహారం

ABN , Publish Date - Nov 13 , 2024 | 06:02 AM

హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకల బెడద తీవ్రమవుతోంది.

హనుమకొండ ఆస్పత్రిలో ఎలుకల స్వైరవిహారం

  • ఇబ్బంది పడుతున్న గర్భిణులు

వరంగల్‌ మెడికల్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకల బెడద తీవ్రమవుతోంది. ఏ వార్డులో చూసినా మూషికాలు స్వైరవిహారం చేస్తుండటంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2022 మార్చిలో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగిని ఎలుకలు కొరుకగా... తీవ్ర రక్తస్రావం జరిగి అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ బదిలీకి కూడా కారణమైంది. అదేవిధంగా అక్కడి సీకేఎం ఆస్పత్రిలో మృతిచెందిన శిశువును ఎలుకలు కొరికిన ఘటన పెను దుమారం రేపింది. ఈ రెండు ఘటనలపై అప్పటి అధికారులు స్పందించి ఎలుకల నివారణకు చర్యలు తీసుకున్నారు. తాజాగా హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకల సంచారం ఎక్కువైంది. ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తూ... అనేక క్రిటికల్‌ కేసులకు సైతం పురుడు పోసిన ఆస్పత్రికి ప్రస్తుతం గర్భిణులు వెళ్లాలంటే జంకుతున్నారు. రోగుల ఎదుటే ఎలుకలు మట్టిని తోడుతున్నా సిబ్బంది పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Nov 13 , 2024 | 06:02 AM