ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Harish Rao: విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా?

ABN, Publish Date - Dec 11 , 2024 | 05:26 AM

రాష్ట్ర వ్యాప్తంగా కాదు.. సొంత జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను సైతం పట్టించుకోని నిర్లక్ష్యపు ముఖ్యమంత్రి ఉండటం ప్రజల దురదృష్టమని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.

స్కూళ్లలో వరుసగా విషాహార ఘటనలు

ప్రభుత్వం ఏం చేస్తోంది?: హరీశ్‌రావు

హైదరాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర వ్యాప్తంగా కాదు.. సొంత జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను సైతం పట్టించుకోని నిర్లక్ష్యపు ముఖ్యమంత్రి ఉండటం ప్రజల దురదృష్టమని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా? ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న ధ్యాస.. పిల్లల భవిష్యత్తుపై లేదా? అంటూ మంగళవారం ‘ఎక్స్‌’ వేదికగా ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుసగా ఆహారం వికటించి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? ఈ ఘటనలపై స్పందించరా? అని నిలదీశారు. పది రోజులు కాక ముందే వికారాబాద్‌ జిల్లా తాండూరు గిరిజన బాలికల హాస్టల్‌లో ఆహారం వికటించి 15 మంది ఆసుపత్రిపాలైన దుస్థితి. సీఎం సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలాఉంటే, రాష్ట్రవ్యాప్తంగా ఇంకెంత దారుణ పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. మాటలే తప్ప చేతలు లేని ముఖ్యమంత్రి తీరువల్ల ఇంకెంతమంది విద్యార్థులు ఆస్పత్రి పాలుకావాలి, ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి.. ఇటువంటి ఘటనలపై తక్షణం చర్యలు చేపట్టాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 11 , 2024 | 05:26 AM