ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponguleti: 10 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

ABN, Publish Date - Dec 03 , 2024 | 03:41 AM

వచ్చే పది రోజుల్లో రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

టేకులపల్లి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): వచ్చే పది రోజుల్లో రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో సోమవారం ఆయన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ తదితరులతో కలిసి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రానున్న పది రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం చేపడుతామని, మొదటి విడతలో స్థలం ఉండి ఇంటి నిర్మాణానికి ఆర్థిక స్థోమతలేని వారికి రూ.5 లక్షలు మంజూరు చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు ఇస్తామని తెలిపారు. అనంతరం మంత్రి టేకులపల్లి మండలం గంగారం ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నదీ లేనిదీ అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Dec 03 , 2024 | 03:41 AM