ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Caste Census: కులగణనపై బీజేపీ వైఖరేంటి?: పొన్నం

ABN, Publish Date - Nov 10 , 2024 | 02:49 AM

కులగణనపై బీజేపీ వైఖరేంటో స్పష్టం చేయాలని.. అనుకూలమా లేక వ్యతిరేకమా అన్నది ఆ పార్టీ నేతలు తేల్చి చెప్పాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.

  • కేటీఆర్‌ కాపలా కుక్కలా అమోయ్‌కుమార్‌: మల్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): కులగణనపై బీజేపీ వైఖరేంటో స్పష్టం చేయాలని.. అనుకూలమా లేక వ్యతిరేకమా అన్నది ఆ పార్టీ నేతలు తేల్చి చెప్పాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌.. బీసీ వర్గాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శనివారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో పొన్నం మాట్లాడుతూ.. బిహార్‌లో కులగణన చేసిన నితీశ్‌ ప్రభుత్వాన్ని, కులగణనపై మహారాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన ఉద్ధవ్‌ ఠాక్రే సర్కారును కూలగొట్టింది.. ఝార్ఖండ్‌లో బీసీ రిజర్వేషన్‌ను 27 శాతానికి పెంచితే గవర్నర్‌ సంతకం కాకుండా ఆపింది బీజేపీ కాదా ప్రశ్నించారు. కులగణనకు కేంద్రంపై ఒత్తిడి తెస్తారా.. లేక బలహీన వర్గాల ద్రోహిగా మిగులుతారా అన్నది రాష్ట్ర బీజేపీ నేతలు తేల్చుకోవాలన్నారు.


బీఆర్‌ఎస్‌ సమగ్ర కుటుంబ సర్వేలాగా దీన్ని గోప్యంగా ఉంచబోమని తెలిపారు. కేటీఆర్‌కు కాపలా కుక్కలా పని చేసిన ఐఏఎస్‌ అమోయ్‌కుమార్‌ రంగారెడ్డి జిల్లా ప్రజలను నిండా ముంచాడని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. మూసీ నీళ్లు తాగిస్తే కానీ కేటీఆర్‌, హరీశ్‌రావుకు బుద్ధి రాదన్నారు. ‘సన్నాసుల్లారా.. మహాత్మాగాంధీతో కేసీఆర్‌ను పోలుస్తారా? కేసీఆర్‌ గాంధీ కాదు గాడ్సే.. మీలాగా సీఎం రేవంత్‌ చిల్లర మాటలు మాట్లాడలేదు’ అంటూ వ్యాఖ్యానించారు. పదేళ్ల పాటు అబద్ధాలతో పబ్బం గడిపిన బీఆర్‌ఎస్‌ నేతలు.. మళ్లీ ఇప్పుడు కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని మహిళా కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ బండ్రు శోభారాణి ఫైర్‌ అయ్యారు. ఇంటికో ఉద్యోగం, రూ.లక్ష రుణమాఫీ అమలు, డబుల్‌ బెడ్రూం ఇళ్లు, జిల్లాకొక మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మిస్తామన్న హామీలు ఏమేరకు అమలు చేశారని నిలదీశారు.

Updated Date - Nov 10 , 2024 | 02:49 AM