Minister Sitakka : ధర్నా ఢిల్లీలో చేపట్టండి
ABN, Publish Date - Oct 23 , 2024 | 05:30 AM
గడిచిన పదేళ్లలో మూసీ ప్రక్షాళన కోసం, ఆ ప్రాంత ప్రజల సంక్షేమం, ఉపాధి కోసం నయాపైసా కేటాయించని ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం ఎదుట ధర్నా చేపట్టాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని రాష్ట్ర మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సూచించిన సీతక్క
హైదరాబాద్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): గడిచిన పదేళ్లలో మూసీ ప్రక్షాళన కోసం, ఆ ప్రాంత ప్రజల సంక్షేమం, ఉపాధి కోసం నయాపైసా కేటాయించని ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం ఎదుట ధర్నా చేపట్టాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని రాష్ట్ర మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. సొంత నియోజకవర్గం గుండా మూసీ పారుతున్నా ఏనాడు కేంద్రం నుంచి నిధులు తీసుకురాని కిషన్ రెడ్డి, ఇప్పుడు మూసీ ప్రాంత ప్రజల తరుఫున ధర్నాకు పిలువునివ్వడం ఎందుకని ప్రశ్నించారు. మూసీ ప్రాంత ప్రజల పక్షాన ఈ నెల 25న ఇందిరాపార్క్ వద్ద బీజేపీ తలపెట్టిన ధర్నాను విరమించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. మూసీ పరివాహక ప్రాంతంలో ముగ్గురు బీజేపీ ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నందున.. కేంద్రంతో చర్చించి రూ.10 వేల కోట్లు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు.
Updated Date - Oct 23 , 2024 | 05:31 AM