TG News: రైతు భరోసా, పంటల బీమా, రుణ మాఫీ పథకం విధి విధానాలపై కసరత్తు
ABN, Publish Date - Apr 15 , 2024 | 05:10 PM
రైతు భరోసా, పంటల బీమా, రుణ మాఫీ పథకం విధి విధానాలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఈ అంశంపై చర్చించారు. పంట రుణాల రికవరీ కోసం రైతులను ఇబ్బందికి గురి చేయొద్దని బ్యాంకులకు, పరపతి సంఘాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
హైదరాబాద్: రైతు భరోసా, పంటల బీమా, రుణ మాఫీ పథకం విధి విధానాలపై తెలంగాణ (Telangana) ప్రభుత్వం కసరత్తు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలతో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఈ అంశంపై చర్చించారు. పంట రుణాల రికవరీ కోసం రైతులను ఇబ్బందికి గురి చేయొద్దని బ్యాంకులకు, పరపతి సంఘాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. వానాకాలానికి సంబంధించి ఎరువులు, విత్తనాలను ముందుగా సిద్ధం చేసుకోవాలని అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్ యార్డుకు తీసుకొచ్చే ధాన్యానికి గిట్టుబాటు ధర అందించేలా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. పండ్ల పక్వం కోసం కార్బైడ్ ఉపయోగించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, శనగ, జొన్నల కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
TS Police: పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ నేత డ్యాన్స్.. తిట్టేస్తున్నారు!
ఇది కూడా చదవండి:
TG Politics: ఏపీలో నేతలపై రాళ్ల దాడి.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
Updated Date - Apr 15 , 2024 | 05:10 PM