KCR: ఈ రోజు కేసీఆర్‌ను కలువనున్న ఎమ్మెల్సీ కవిత
ABN, Publish Date - Aug 29 , 2024 | 07:30 AM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు. ఉదయం 10:30గంట లకు ఇంటి నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌కు ఆమె బయలుదేరనున్నారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత తండ్రిని కలిసేందుకు తొలిసారిగా కవిత వెళుతున్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు. ఉదయం 10:30గంట లకు ఇంటి నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌కు ఆమె బయలుదేరనున్నారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత తండ్రిని కలిసేందుకు తొలిసారిగా కవిత వెళుతున్నారు. నిన్న కవిత హైదరాబాద్ చేరుకోగానే ఫోన్ చేసి కూతురుతో కేసీఆర్ మాట్లాడారు. ఈ రోజు లంచ్‌కు రావాలని కవితని ఆయన ఆహ్వానించారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్ట్ అవడంతో ఐదున్నర నెలల పాటు తిహాడ్ జైలులో ఉన్న కవిత ఈ నెల 27న ఆమెకు బెయిల్ లభించింది.
ఆ రోజున రాత్రి 9:10 గంటలకు తిహాడ్ జైల్లోంచి బయటకొచ్చిన కవిత.. 9:40 గంటలకు ఢిల్లీ వసంత్ విహార్‌లోని బీఆర్‌ఎస్ కార్యాలయానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు. బుధవారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ ఉండంతో ఆమె ఢిల్లీలోని బీఆర్ఎస్ భవన్ నుంచే వర్చువల్‌గా హాజరయ్యారు. అనంతరం బుధవారం మధ్యాహ్నం 2:40 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆమెకు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సహా పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.
భారీ కాన్వాయ్‌తో శంషాబాద్ నుంచి కవిత నేరుగా బంజారాహిల్స్‌లోని తన నివాసానికి వచ్చారు. ఆమెకు కేటీఆర్ సతీమణి శైలిమ హారతిచ్చి లోపలికి ఆహ్వానించారు. అనంతరం తల్లి శోభ ఆశీర్వాదాన్ని కవిత తీసుకున్నారు. అక్కడ సమీప బంధువులు, పార్టీ ముఖ్యులను కవిత పలకరించారు. అన్న కేటీఆర్‌కు రాఖీ కట్టారు. ఈ నేపథ్యంలో అన్నాచెల్లెళ్లు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. తన కుటుంబ సభ్యులతో.. సన్నిహితులతో రాత్రి ఒంటి గంట వరకూ మాట్లాడుతూ గడిపారని సమాచారం. ఇక నేడు కవిత ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు వెళ్లి తండ్రి కేసీఆర్‌ను కలవనున్నారు.
Updated Date - Aug 29 , 2024 | 07:30 AM