సీఎంను కలిసిన ఎంపీ, ఎమ్మెల్యేలు
ABN, Publish Date - Dec 23 , 2024 | 01:50 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ ఆదివారం హైద్రాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో గల ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.
జగిత్యాల, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ ఆదివారం హైద్రాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో గల ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. సు మారు గంట పాటు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పలు అభివృద్ధి, సంక్షేమ అంశాల ప్రతిపాదనలపై సీఎంతో చర్చించారు. జగిత్యాల పట్ట ణంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అవసరముందని, మురుగునీటి శుద్ధి ప్లాంట్ అవసరమని కేంద్రానికి ప్ర తిపాదనలు పంపాలని కోరారు. జగిత్యాలలో నవోదయ విద్యాలయం, కేంద్రీయ విద్యాలయం మంజూ రుపై చర్చించారు. బీర్‌పూర్ మండలలో ఏకలవ్య పాఠశాల ఏర్పాటు, కేజీబీవీ పాఠశాల ఏర్పాటు, నిధుల మంజూరు, స్థలం కేటాయింపు అంశాలు, జగిత్యాల రూరల్ మండలానికి కేజీబీవీ పాఠశాల ప్రతిపా దన లు, జగిత్యాలకు మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ చల్‌గల్ వాలంతరీలో ఏర్పాటు చేయాలని కోరారు. రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని, నూకపల్లి అర్బన్ హౌజిం గ్ కాలనీని జగిత్యాల మున్సిపల్‌లో విలీనం చేయాలని, జగిత్యాల అర్బన్, జగిత్యాల రూరల్ మండలాల పునర్విభజన చేయాలని కోరారు.
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో చర్చించిన అంశాలు..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిజామబాద్ పార్లమెంట్ పరిధిలో మంజూరు చేసిన జగిత్యాల, నిజామా బాద్ నవోదయ పాఠశాలల ఏర్పాటుకు ఒక్కో చోట సుమారు 20 ఎకరాల భూమిని కేటాయించాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ అర్వింద్ వివరించారు. రెండు జిల్లాల్లో ప్రతిపాదిత స్థలాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులను వివరి స్తూ..మాదవ్ నగర్ ఆర్‌ఓబీ 50-50 పద్ధతిలో మంజూరు చేశారని, అడివి మామిడిపల్లి ఆర్‌ఓబీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరు అయినప్పటికీ, గత బీఆర్‌ఎస్ సర్కారు నిధులను మళ్లించిందని సీఎంకు తెలిపారు. కాంట్రాక్టర్లకు సరియైున సమయంలో బిల్లులు అందడం లేదని, సకాలంలో బిల్లులు మంజూరు అయ్యేలా చొరవ చూపాలని కోరారు. మరోవైపు జగిత్యాల పట్టణంలో కేంద్రీయ విద్యాలయం సైతం మంజూరయ్యే దశలో ఉందని, దీనికి కూడ స్థల అన్వేషణ చేయాలని కోరారు. తమ ప్రతిపాద నలకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ అర్వింద్, మ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌లు తెలిపారు.
Updated Date - Dec 23 , 2024 | 01:50 AM