ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MP Lakshman: ఢిల్లీకి లక్ష్మణ్.. బీజేపీ ఎంపీ అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం

ABN, Publish Date - Mar 23 , 2024 | 06:24 PM

ఎంపీ, బీజేపీ నేత లక్ష్మణ్ శనివారం ఢిల్లికి వెళ్లనున్నారు. అక్కడ బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఖమ్మం, వరంగల్ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరగనుంది.

ఢిల్లీ: ఎంపీ, బీజేపీ నేత లక్ష్మణ్(MP Lakshman) శనివారం ఢిల్లికి వెళ్లనున్నారు. అక్కడ బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఖమ్మం, వరంగల్ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరగనుంది. అధిష్టానం వరంగల్ బీజేపీ టికెట్‌ను ఆరూరి రమేష్ కు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఖమ్మం టికెట్ రేసులో జలగం వెంకట్రావు, పీవీ రమేష్‌లు ఉండటంతో ఆ టికెట్ ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావును బీజేపీలో చేర్చుకుని ఖమ్మం టికెట్ ఇచ్చే అవకాశమూ లేకపోలేదు. ఇదే మీటింగ్‌లో కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు బీజేపీ ఎలక్షన్ కమిటీ అభ్యర్థిని ఎంపిక చేయనుంది.

కంటోన్మెంట్ టికెట్ రేసులో మన్నె శ్రీనివాస్, రజని, కడియం కళ్యాణ్ ఉన్నారు. ఇలా వరుస సమావేశాలతో టికెట్లు ఖరారు చేస్తూ.. వీలైనంత త్వరగా ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని బీజేపీ భావిస్తోంది.

Updated Date - Mar 23 , 2024 | 06:26 PM

Advertising
Advertising