ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా ముత్యాలమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠ

ABN, Publish Date - Dec 12 , 2024 | 03:54 AM

సికింద్రాబాద్‌ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంలో ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ బుధవారం వైభవంగా జరిగింది. సోమవారం నుంచి మొదలైన విగ్రహ పునఃప్రతిష్ఠ బుధవారం జరిగిన పూజలతో ముగిసింది.

  • అక్టోబరులో విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుడు

  • ఆ స్థానంలో 256 కేజీల పంచలోహ విగ్రహం ప్రతిష్ఠ

  • పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ, పొన్నం

సికింద్రాబాద్‌, డిసెంబరు11(ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంలో ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ బుధవారం వైభవంగా జరిగింది. సోమవారం నుంచి మొదలైన విగ్రహ పునఃప్రతిష్ఠ బుధవారం జరిగిన పూజలతో ముగిసింది. అక్టోబరులో ఓ దుండగుడు ఈ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఘటన వివాదాస్పదమవ్వగా.. స్పందించిన దేవాదాయ శాఖ అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని తయారు చేయించి ఆలయాన్ని పునర్నిర్మించి బుధవారం విగ్రహ ప్రతిష్ఠాపన పూర్తి చేసింది. బుధవారం జరిగిన పూజా కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.


ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఓ దుండగులు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దురదృష్టకరమని అన్నారు. అయితే, 256 కిలోల అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని తయారు చేయించి ప్రతిష్ఠించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. విభిన్న సంస్కృతులు, మతాలకు నిలయమై మినీ ఇండియాగా పేరు గాంచిన హైదరాబాద్‌లో మత కల్లోలాలు జరగకూడదని అన్నారు. ఇక, స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తికి స్పందించిన ప్రభుత్వం విగ్రహ పునఃప్రతిష్ఠ చేసిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను కలిసికట్టుగా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. విగ్రహా పునఃప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొన్న సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ మాట్లాడుతూ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ వేడుకల్లో కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శ్రీగణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 12 , 2024 | 03:54 AM