ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీపీఐ చరిత్ర అంతా పోరాటాలమయం

ABN, Publish Date - Dec 27 , 2024 | 12:33 AM

సీపీఐ వందేళ్ల చరిత్ర అంతా పేదలు, అణగారిన వర్గాల పక్షాన పోరాటాలేననీ ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు.

సంస్థాననారాయణపురంలో ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఐ నాయకులు

ఆంధ్రజ్యోతి-న్యూ్‌సనెట్‌వర్క్‌: సీపీఐ వందేళ్ల చరిత్ర అంతా పేదలు, అణగారిన వర్గాల పక్షాన పోరాటాలేననీ ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లాలోని అన్ని మండలాల్లో గురువారం సీపీఐ శతాబ్ది దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ పతాకాన్ని నాయకులు ఆవిష్కరించి మాట్లాడారు. ఓట్లు, సీట్ల కోసం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడేది సీపీఐ మాత్రమేనన్నారు. భారత స్వాతంత్ర్యోద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, వేలాది ఎకరాల భూమి పేదలకు భూమి పంచడంలో సీపీఐ కీలక పాత్ర పోషించిందని అన్నారు. వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. నిరుపేదలకు ఇళ్లు, రేషనకార్డులు, పింఛన్లు దక్కే వరకు పేదల పక్షాన నిలబడి వీరోచిత పోరాటాలు నిర్వహించిన ఘన చరిత్ర సీపీఐ అని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. శతాబ్ది దినోత్సవం సందర్భంగా నల్లగొండలో ఈ నెల 30వ తేదీన నిర్వహించే సీపీఐ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. చౌటుప్పల్‌ పట్టణంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిణి యాదగిరి రావు సీపీఐ జెండాను యాదగిరిరావు ఆవిష్కరించారు. సంస్థాన నారాయణపురం మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో మహా ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, ిసీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగోని గాలయ్య, చౌటుప్పల్‌ మండల కార్యదర్శి పల్లె శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. భూదానపోచంపల్లి పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి గోడల్ల నాగభూషణ్‌గౌడ్‌, సహాయ కార్యదర్శి ముసునూరి రాములు, పట్టణ కార్యదర్శి మిర్యాల కృష్ణమూర్తి, రైతు సంఘం నాయకులు సుర్కంటి సాయిరెడ్డి పాల్గొన్నారు. వలిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన సపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బోడ సుదర్శన, మండల కార్యదర్శి పోలెపాక యాదయ్య, మండల సహా కార్యదర్శి బాలగోని సత్యనారాయణ పాల్గొన్నారు. రామన్నపేటలో పార్టీ మండల కార్యదర్శి ఊట్కూరి నర్సింహ, మండల సహాయ కార్యదర్శి ఎర్ర రమే్‌షగౌడ్‌, పట్టణ కార్యదర్శి శివరాత్రి సమ్మయ్య, నాయకులు ఊట్కూరి భగవంతు, బాలగోని మల్లయ్య పాల్గొన్నారు. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంతోపాటు రాఘవాపురం గ్రామాల్లో పార్టీ జెండాలను ఎగురవేశారు. మోత్కూరు పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించి, కూడలి ప్రదేశాల్లో ఎర్ర జెండాలు ఎగురవేశారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మీనర్సయ్య, సీపీఐ మండల, పట్టణ కార్యదర్శులు అన్నెపు వెంకట్‌, పుల్కరం మల్లేష్‌, గొలుసుల యాదగిరి పాల్గొన్నారు. మోటకొండూరులో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బొలగాని సత్యనారాయణ, ఆలేరులో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్‌, మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య పాల్గొన్నారు. అడ్డగూడూరులో సీపీఐ మండల కార్యదర్శి రేఖల శ్రీనివాస్‌, జిల్లా సమితి సభ్యులు ఉప్పుల శాంతి కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 12:33 AM