ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏడాదంతా సంక్షేమ సందడి

ABN, Publish Date - Dec 31 , 2024 | 12:28 AM

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మారి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఎన్నికల మ్యానిఫెస్టోపైనే ఏడాదంతా ప్రజల్లో ఆస క్తి కొనసాగింది. ఆరు గ్యారెంటీల అమలుకు తొలుత ‘ప్రజాపాలన’ కార్యక్రమంలో అధికారులు దరఖాస్తులు తీసుకున్నారు.

రుణమాఫీ పథకం కింద రూ.1,750 కోట్ల లబ్ధి

6.67 కోట్ల మహాలక్ష్మి ప్రయాణాలు

ఉచిత విద్యుత్‌, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకాల అమలు

రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లకు ఎదురుచూపులు

(ఆంధ్రజ్యోతిప్రతినిధి, నల్లగొండ): రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మారి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఎన్నికల మ్యానిఫెస్టోపైనే ఏడాదంతా ప్రజల్లో ఆస క్తి కొనసాగింది. ఆరు గ్యారెంటీల అమలుకు తొలుత ‘ప్రజాపాలన’ కార్యక్రమంలో అధికారులు దరఖాస్తులు తీసుకున్నారు. జనవరి నుంచి మార్చి వరకు ఈ దరఖాస్తుల స్వీకరణ కొనసాగగా, ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాల్లో పార్లమెంటు ఎన్నికలు, ఎమ్మె ల్సీ ఎన్నిక షెడ్యూల్‌ రావడంతో ఈ ప్రక్రియకు బ్రేక్‌పడింది.

అప్పటివరకు కేవలం మహాలక్ష్మి పథకం మాత్రమే అమలైంది. స్వల్పంగా రూ.500కే గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ, గృహజ్యోతి పథకం అమలైంది. పెండింగ్‌లో ఉన్న గత ఏడాది వానాకాలపు రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందజేశారు. మొత్తంగా ఏడాదంతా ఆరు గ్యారెంటీలు, కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చి న డిక్లరేషన్ల అమలుకోసం ప్రజలు ఎదురుచూశారు. వీటి ల్లో అమలైన వాటితో సందడి వాతావరణం కొనసాగితే, అమ లు కాని వాటికోసం ప్రజల్లో ఎదురుచూస్తున్నారు.

రూ.500కే సిలిండర్‌తో 5.96లక్షల కుటుంబాలకు లబ్ధి

ఉమ్మడి జిల్లాలో రూ.500కే సిలిండర్‌ పథకం కింద 5,96, 702కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఈ పథకం కింద బీపీఎల్‌ పరిధిలోకి వచ్చే మహిళలను గుర్తించారు. నల్లగొండ జిల్లాలో 2,34,294 మంది, సూర్యాపేట జిల్లాలో 1,87,196, యాదాద్రి జిల్లాలో 1,75,212 మందికి గ్యాస్‌ సిలిండర్‌ మంజూరవుతోంది.

5.75లక్షల కుటుంబాలకు గృహజ్యోతి వర్తింపు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గృహజ్యో తి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగదారులకు ఉచిత విద్యుత్‌ కింద జీరో బిల్లులు ఇస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 2,32,215 విద్యుత్‌ కనెక్షన్లు, యా దాద్రి జిల్లాలో 1,56,234 కనెక్షన్లు, సూర్యాపే ట జిల్లాలో 1,87,342 కనెక్షన్లకు ఈ పథకం వర్తిస్తోంది. మొత్తం ఉమ్మడి జిల్లాలో ఈ పథకం కింద 5,75,791 మంది లబ్ధిదారులకు ఉచిత విద్యుత్‌ అందుతోంది.

రూ.1,750 కోట్ల రుణమాఫీ

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రూ.2లక్షల రైతు రుణమాఫీలో భాగంగా ఉమ్మడి జిల్లాలో విడతల వారీగా ఈ పథకాన్ని అమలు చేశారు. ఇప్పటివర కు మొత్తం 4,75,600 మంది రైతులకు రూ.1,750.65కోట్ల రుణమాఫీ పూర్తయింది. అయితే ఇంకా సుమారు 20వేల మంది వరకు రైతులకు అర్హులైనప్పటికీ సాంకేతిక కారణాలు, ఆధార్‌ సీడింగ్‌ లేకపోవడం, ఉమ్మడి కుటుంబం కలిగి ఉండడం, జాయింట్‌ అకౌంట్ల వంటి తదితర కారణాలతో రుణమాఫీ అందని రైతులు ఆందోళనలో ఉన్నారు.

‘మహాలక్ష్మి’ ప్రయాణాలు 6.67కోట్లు

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న ఆరు గ్యారెంటీల్లో కీలకమైన మహాలక్ష్మి ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ కింద ఇప్పటివరకు 6.67లక్షల మంది మహిళలు సద్వినియోగం చేసుకున్నారు. వీరందరికీ జీరో టిక్కెట్లు అందజేశారు. మహిళలకు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఆధార్‌కార్డు ద్వారా ఉచితంగా బస్సు ప్రయాణ సదుపాయం కల్పించారు. ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో మొత్తం ఇప్పటివరకు 6.67కోట్ల మహిళలు ఉచితంగా ప్రయాణించారు. దేవరకొండ డిపోలో 1.24కోట్లు, కోదాడ డిపోలో 0.81కోట్లు, మిర్యాలగూడ డిపోలో 1.04కోట్లు, నల్లగొండ డిపోలో 1.02, నార్కట్‌పల్లి డిపోలో 0.23కోట్లు, సూర్యాపేట డిపోలో 1.32కోట్లు, యాదగిరిగుట్ట డిపోలో 0.99కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయి. ఈ పథకం ద్వారా ఆర్టీసీ ఆదాయం కోల్పోతుందని ప్రతిపక్షాలు పేర్కొంటుంటే ఆర్టీసీ మాత్రం ఆదాయం పెరిగిందని చెబుతోంది.

ఇందిరమ్మ ఇళ్ల సర్వే ముమ్మరం

ఆరు గ్యారెంటీల్లో మరో కీలకమైన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇటీవలే పట్టాలెక్కింది. ఈ పథకం కింద అర్హులను గుర్తించేందుకు ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ, హౌసింగ్‌ అధికారులు సర్వేచేపట్టారు. సరే ్వ సందర్భంగా నిరుపేదలను గుర్తించే సమయంలో గ్రామస్థాయిల్లో ఏర్పాటు చేసిన ఇందరిమ్మ కమిటీల్లో స్థానం కోసం కాంగ్రెస్‌ నాయకులు పోటీలుపడడం, జాబితాలో తమ అనుచరులు, ఇతర సానుభూతిపరుల పేర్లుండేలా చూడాలని తాపత్రయపడుతున్నారు. అయితే గతంలో లబ్ధిపొందినవారిని ఈ పథకంలో చేర్చకపోతుండడంతో కొంత ఆందోళన కనిపిస్తోంది.

మహిళలకు రూ.2,500 కానుక కోసం ఎదురుచూపు

కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల్లో ఇచ్చిన మరో కీలక హామీ మహిళలకు నెలకు రూ.2,500 ప్రోత్సాహకం ఎప్పుడిస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారు. వీటితో పాటు సామాజిక పింఛన్లు రూ.4వేలకు పెంచుతామని, ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తామనే హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొంది.

యాసంగికి ‘రైతుభరోసా’?

రైతుబంధు స్థానంలో రైతుభరోసా పేరుతో పెట్టుబడి సాయంగా ఎకరాకు ఏడాదికి రూ.15వేలు ఇస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ అమలుకు ఇటీవలే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీంతో యాసంగికి ‘రైతుభరోసా’ వస్తుందనే ధీమా రైతుల్లో ఉంది. ఉమ్మడి జిల్లాలో రైతుబంధు పథకం కింద సుమారు 9.50లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. సాగులో లేని భూములు, 10 ఎకరాల సీలింగ్‌ విధిస్తే లబ్ధిదారుల్లో కోతపడనుంది.

Updated Date - Dec 31 , 2024 | 12:28 AM