మెరుగైన సేవలందించాలి
ABN, Publish Date - Dec 22 , 2024 | 12:11 AM
వినియోగదారులకు సకాలంలో మెరుగైన సేవలందించేందుకు అధికారు లు ప్రత్యేక దృష్టి సారించాలని న్యూఢిల్లీకి చెందిన కేంద్ర జా యింట్ సెక్రటరీ, చీఫ్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ డాక్టర్ కేజే శ్రీనివాస సూచించారు. శనివారం భువనగిరి పట్టణంలో హెడ్‌పోస్టాఫీ్‌స లో ఉన్న పాస్‌పోర్ట్ సేవా కార్యాలయాన్ని ఆయన సందర్శించా రు.
పాస్‌పోర్ట్ చీఫ్ ఆఫీసర్ డాక్టర్ కేజే శ్రీనివాస
భువనగిరి రూరల్, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): వినియోగదారులకు సకాలంలో మెరుగైన సేవలందించేందుకు అధికారు లు ప్రత్యేక దృష్టి సారించాలని న్యూఢిల్లీకి చెందిన కేంద్ర జా యింట్ సెక్రటరీ, చీఫ్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ డాక్టర్ కేజే శ్రీనివాస సూచించారు. శనివారం భువనగిరి పట్టణంలో హెడ్‌పోస్టాఫీ్‌స లో ఉన్న పాస్‌పోర్ట్ సేవా కార్యాలయాన్ని ఆయన సందర్శించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాలకు వెళ్లేందు కు వినియోగదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న సందర్భంలో వారికి సత్వరమే మెరుగైన సేవలందించేందుకు అధికారులు సహకరించాలన్నారు. జిల్లాకేంద్రంలోని భువనగిరిలో పాస్‌పోర్ట్ కేంద్రం ఏర్పాటుతో పరిసర జిల్లాలు అయిన మేడ్చల్ మల్కాజిగిరి, జనగాం, హనుమకొండ, నల్లగొండ, వరంగల్, సిద్దిపేటలకు చెందిన వినియోగదారులకు సకాలంలో సేవలందించాలన్నారు. ప్రస్తుతం ఈ పాస్‌పోర్ట్ కేంద్రంలో రోజుకు సుమా రు 40నుంచి 45 స్లాట్లకు సంబంధించి పాస్‌పోర్ట్‌లకు క్లియరన్స్‌లు ఇస్తున్నామని, దీనిని 90 స్లాట్లకు పెంచేందుకు సత్వర చర్య లు తీసుకుంటామన్నారు. ముందుగా ఆయనకు పుష్పగుచ్ఛం అందచేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ జొన్నలగడ్డ స్నేహజ, అసిస్టెంట్ డైరెక్టర్ ఎ.అనిల్‌కుమార్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె.హరికృష్ణ, బ్రాంచ్ పోస్టు మాస్టర్ జె.రాములు, పి.శ్యాంసుందర్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
Updated Date - Dec 22 , 2024 | 12:11 AM