ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Yadadri: నేటి నుంచి లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవాలు

ABN, Publish Date - Mar 11 , 2024 | 08:59 AM

యాదగిరిగుట్ట, మార్చి 10: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10గంటలకు ప్రధానాలయ ముఖ మండపంలో అర్చక, వేదపండితుల బృందం సంప్రదాయరీతిలో లక్ష్మీనృసింహుల తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.

యాదగిరిగుట్ట, మార్చి 10: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10గంటలకు ప్రధానాలయ ముఖ మండపంలో అర్చక, వేదపండితుల బృందం సంప్రదాయరీతిలో లక్ష్మీనృసింహుల తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. తొలిరోజు వైదిక పూజల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనున్నారు. ఆయన సోమవారం ఉదయం 9గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి కాన్వాయ్‌లో కొండపైకి చేరుకుని వీఐపీ అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. 9.30గంటలకు ప్రధానాలయంలో స్వయంభువులను దర్శించుకుంటారు. స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవస్థాన అధికారులకు అందజేస్తారు. ఉదయం 11గంటలకు రేవంత్‌ హెలికాప్టర్‌లో భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయానికి బయల్దేరివెళతారు. సీఎం రేవంత్‌ పర్యటన నేపథ్యంలో కొండ కింద పాత గోశాల ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్‌ వద్ద పనులను ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య ఆదివారం పరిశీలించారు. బ్రహ్మోత్సవాల తొలిరోజు పూజల్లో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, పలువురు మంత్రులు పాల్గొంటారని అధికారులు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఈసారి రూ.1.60కోట్లు కేటాయించామని, అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో రామకృష్ణారావు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగం గా 18న జరిగే తిరుకల్యాణోత్సవంలో భక్తులు పాల్గొనే విధంగా 600 టికెట్లను విక్రయిస్తామని, ఒక్కో టికెట్‌ ధర రూ.3వేలని తెలిపారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 17న రాత్రి ఎదుర్కో లు, 18న రాత్రి తిరుకల్యాణోత్సవం, 19న రాత్రి దివ్య విమాన రథోత్సవ ఘట్టాలను నిర్వహిస్తారు. ఈ నెల 20న మహాపూర్ణాహుతి, చక్రతీర్థ స్నానం ఉంటుంది. 21వ తేదీన అష్టోత్తర శతఘటాభిషేకం, పండిత సన్మానంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.

Updated Date - Mar 11 , 2024 | 08:59 AM

Advertising
Advertising