ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆవు పాలకు గేదె పాల బిల్లు

ABN, Publish Date - Dec 28 , 2024 | 12:44 AM

నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మదర్‌ డెయిరీ పరిధిలోని భువనగిరి మిల్క్‌ చిల్లింగ్‌ పరిధిలో అక్రమాలపై విచారణ కొనసాగుతోంది. భువనగిరి కేంద్రంలో ఉద్యోగులు లక్షల రూపాయలు అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో మదర్‌ డెయిరీ చైర్మన గుడిపాటి మధుసూదనరెడ్డి ఆరుగురు ఉద్యోగులపై వేటు వేసి విచారణకు ఆదేశించారు.

ఇప్పటికే ఆరుగురిపై సస్పెన్షన వేటు

ప్రతి నెలా రూ.2 లక్షలు కాజేసినట్లు ఆరోపణలు

నల్లగొండ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మదర్‌ డెయిరీ పరిధిలోని భువనగిరి మిల్క్‌ చిల్లింగ్‌ పరిధిలో అక్రమాలపై విచారణ కొనసాగుతోంది. భువనగిరి కేంద్రంలో ఉద్యోగులు లక్షల రూపాయలు అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో మదర్‌ డెయిరీ చైర్మన గుడిపాటి మధుసూదనరెడ్డి ఆరుగురు ఉద్యోగులపై వేటు వేసి విచారణకు ఆదేశించారు. ఈ డెయిరీ కేంద్రం కింద 13 పాలకేంద్రాలు ఉన్నాయి. ప్రతి రోజూ దాదాపు 4వేల లీటర్ల పాలను సేకరిస్తారు. భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి పరిధిలోని ఎంబావి పాలకేంద్రం నుంచి వచ్చే ఆవు పాలను, గేదె పాలుగా చూపించి అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. చైర్మనతో పాటు ఇద్దరు సూపర్‌వైజర్లు, వెన్న శాతం లెక్కించే మరో ముగ్గురు సిబ్బందితో కలిసి అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఏడాది జులై వరకు ఆయా కేంద్రాలకు 400 లీటర్ల వరకు ఆవు పాలు వచ్చేవి అయితే ఆగస్టు నుంచి పూర్తిగా గేదెపాలు పోస్తున్నట్లు రికార్డుల్లో నమోదు చేశారు. దాదాపు నాలుగున్నర నెలలుగా 400 లీటర్ల వరకు ఆవు పాల దిగుబడి రాగా ఒక్కసారిగా దిగుబడి ఎలా తగ్గిందో తెలుసుకునేందుకు రికార్డులు తనిఖీ చేశారు. ఉదయం, సాయంత్రం సేకరించిన 400 లీటర్ల ఆవు పాలను గేదె పాలుగా చూపించి రికార్డుల్లో నమోదు చేసి, అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. ప్రతి నెలా రెండు లక్షల చొప్పున అక్రమాలకు పాల్పడి దాదాపు రూ.10 లక్షలను స్వాహా చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఆరుగురిపై మదర్‌ డెయిరీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ విషయంపై మదర్‌ డెయిరీ ఎండీ కృష్ణను వివరణ కోరగా తాను ప్రస్తుతం సెలవుల్లో ఉన్నానని, చైర్మన ఆదేశాల మేరకు విచారణ సాగుతుందని తెలిపారు.

Updated Date - Dec 28 , 2024 | 12:45 AM