ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి

ABN, Publish Date - Dec 23 , 2024 | 12:19 AM

సమగ్ర శిక్ష ఉద్యోగు ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీయూటీఎఫ్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దామెర శ్రీనివాస్‌ అన్నారు.

రేవంతరెడ్డి చిత్రపటానికి వినతిపత్రం అందజేస్తున్న సమగ్ర శిక్ష అభియాన ఉద్యోగుల పిల్లలు

సూర్యాపేట(కలెక్టరేట్‌), డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : సమగ్ర శిక్ష ఉద్యోగు ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీయూటీఎఫ్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దామెర శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో చేపట్టిన నిరసన కా ర్యక్రమానికి సంఘీభావం తెలిపి, మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు 13 రో జులుగా విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నా, ప్రభుత్వం కనీసం వారితో మా ట్లాడే ప్రయత్నం చేయకపోవడం భాధాకరమన్నారు. తమ న్యాయమైన డి మాండ్లను పరిష్కరించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. సుమారు 20 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తుంటే రెగ్యులర్‌ చేయకపోవడం సమంజసంకాదన్నారు. ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజీ కల్పించాలన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సం ఘం జిల్లా అధ్యక్షుడు ఆర్‌ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి గడ్డం శ్రీనివాస్‌, సుజా త, మాధవి, సురేష్‌, ఉపేందర్‌రెడ్డి, ప్రవీణ్‌, శ్రీనివాస్‌, మంగమ్మ, రజిత, సునీత, నాగమణి, రాజేష్‌, అనురాధ, శ్రీలత, ప్రసాద్‌, నాగరాజు, లింగయ్య పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2024 | 12:19 AM