ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సఖి కేంద్రం భవనం పూర్తి చేయరూ..

ABN, Publish Date - Dec 28 , 2024 | 01:09 AM

హింసకు గురైన మహిళలకు ఒకే చోట వైద్య, కౌన్సిలింగ్‌, పోలీస్‌, న్యాయ సహాయం, ఉచిత వసతి లాంటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం సఖి కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది.

అసంపూర్తిగా నిలిచిన సఖి కేంద్రం నిర్మాణం

నాలుగేళ్లుగా అద్దె భవనంలో కొనసాగింపు

సొంత భవనంలోకి మార్చాలని పలువురి విన్నపం

భువనగిరి రూరల్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): హింసకు గురైన మహిళలకు ఒకే చోట వైద్య, కౌన్సిలింగ్‌, పోలీస్‌, న్యాయ సహాయం, ఉచిత వసతి లాంటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం సఖి కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు, గృహహింస, ఆడ పిల్లల విక్రయాల నివారణ కోసం ప్రభుత్వం ఆయా జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం సఖి కేంద్రాలను ఏర్పాటు చేసింది. భువనగిరిలో ఈ కేంద్రాన్ని ప్రస్తుతం అద్దెభవనంలో నడిపిస్తోంది. రెండేళ్ల క్రితం సొంత భవన నిర్మాణం కోసం రూ.48లక్షల నిధులు మంజూరు చేసినప్పటికీ భవన నిర్మాణం అసంపూర్తిగానే మిగిలింది. అదనపు నిధులు కేటాయించి, భవన నిర్మాణానికి అందుబాటులోకి తేవాలని బాధితులు, మహిళలు కోరుతున్నారు. మహిళా బాధితులకు అండగా ఉండేందుకు గాను భువనగిరి జిల్లా కేంద్రంలో 2019 నవంబరు 4న సఖి కేంద్రం అద్దె భవనంలో ఏర్పాటు చేసుకుని తమ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. భువనగిరి శివారులోని మాసుకుంట వద్ద దాదాపు 20గుంటల స్థలంలో మహిళా శిశు వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2022 సెప్టెంబరు 19న రూ.48లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సఖి కేంద్ర భవన శంకుస్థాపన కార్యక్రమం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జడ్పీ చైర్మన ఎలిమినేటి సందీ్‌పరెడ్డి చేతుల మీదుగా అట్టహాసంగా శిలాఫలకం వేశారు. అయితే రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ సఖీ కేంద్రం నిర్మాణ పనులు నిధుల లేమితో అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. అయితే సంవత్సర కాలం నుంచి సఖి కేంద్రం నిర్మాణంలో ఎలాంటి పనుల పురోగతి లేదు. దీంతో నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు మరో రూ.25లక్షల నిధులు అదనంగా కావాల్సి ఉందని పంచాయతీ రాజ్‌ శాఖ అదికారులు పేర్కొంటున్నారు. సఖి కేంద్రం ఏర్పాటుకు రూ.25లక్షల నిదులు మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డి దృష్టికి అధికారులు తీసుకువచ్చారు.ఈ విషయమై ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డి ప్రత్యేక అభివృద్ధి నిధులు (ఎస్‌డీఎఫ్‌) రూ.25లక్షలు సమకూరుస్తానని, నిధులు మంజూరు కాగానే వెంటనే సఖి కేంద్రం నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం స్థానిక హౌసింగ్‌ బోర్డు కాలనీలో రెండో అంతస్తులో ప్రైవేటు భవనంలో నెలకు రూ.15,228 అద్దె కొనసాగుతోంది. రెండో అంతస్తులో కార్యాలయం కొనసాగుతుండడంతో బాధిత మహిళలు పై అంతస్తు ఎక్కేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకుని అసంపూర్తిగా ఉన్న సఖి కేంద్ర నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసి పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అద్దె భవనంలో కొనసాగుతున్న సఖి కేంద్రం భువనగిరి పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఉంది. బస్టాండ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. కార్యాలానికి వెళ్లాలంటే ఇబ్బందవుతోందని బాధితులు పేర్కొంటున్నారు. సఖి కేంద్రం అద్దె భవనంలో రెండో అంతస్తులో ఉంది. రెండో అంతస్తులోకి వెళ్లి ఫిర్యాదు చేయాలంటే బాధితులు ఇబ్బందిపడుతున్నారు. నూతన భవన నిర్మాణం పూర్తయితే బాధితులకు అనేక ఇబ్బందులు తప్పనున్నాయి.

అదనపు నిధులకోసం అధికారుల కృషి

మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో సఖి కేంద్రం నిర్వహణ కోసం భువనగిరి శివారులోని మాసుకుంట వద్ద భవన నిర్మాణం కొనసాగుతోంది. అప్పటి ప్రభుత్వం రూ.48లక్షలు నిధులు మంజూరు చేసింది. అయితే మరో రూ.25లక్షలు అదనపు నిధులు మంజూరు చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. నిధులు మంజూరై నిర్మాణం పూర్తి కాగానే సఖి కేంద్రాన్ని అక్కడికి తరలించి, సేవలందిస్తాం.

-సీహెచ.లావణ్య, సఖి కేంద్రం నిర్వాహకురాలు

Updated Date - Dec 28 , 2024 | 01:09 AM