గృహజ్యోతి లబ్ధిదారులు పెరిగారు
ABN, Publish Date - Dec 23 , 2024 | 12:58 AM
పెరిగిన చలితో ఇళ్లలో ఫ్యాన్లు, ఏసీలు తదితర విద్యుత్ ఆధారిత గృహోపకరణాల వినియోగం తగ్గింది. అలాగే గృహజ్యోతి అమలుకు 200 యూనిట్ల కటాఫ్ ఉండటంతో పలువురు విద్యుత్ పొదుపు పాటిస్తున్నారు.
చలికాలంలో విద్యుత్ పొదుపే కారణం
10 నెలలుగా 1.44లక్షల మందికి రూ.41.59కోట్లు సబ్సిడీ
భువనగిరి టౌన్, డిసెంబరు 21 (ఆంరఽధజ్యోతి): పెరిగిన చలితో ఇళ్లలో ఫ్యాన్లు, ఏసీలు తదితర విద్యుత్ ఆధారిత గృహోపకరణాల వినియోగం తగ్గింది. అలాగే గృహజ్యోతి అమలుకు 200 యూనిట్ల కటాఫ్ ఉండటంతో పలువురు విద్యుత్ పొదుపు పాటిస్తున్నారు. ఫలితంగా క్రమేపీ జిల్లాలో గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకమైన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకం కారణంగా పెరుగుతున్న విద్యుత్ పొదుపుతో జెన్‌కోపై ఉత్పత్తి భారంతోపాటు డిస్కంలపై సరఫరా భారం తప్పినట్టయిందని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే వినియోగదారులకు నెలవారీగా తప్పుతున్న విద్యుత్ చార్జీల భారం ఇతర అవసరాలకు ఉపయోగపడుతున్నట్టు పలువురు పేర్కొంటున్నారు. కాగా, జిల్లాలో గృహ విద్యుత్ కనెక్షన్లు 2,75,089 ఉండగా, గృహజ్యోతి పథకం ప్రారంభమైన మార్చి నుంచి డిసెంబరు వరకు 1,44,780 మంది లబ్ధి పొందారు.
10 నెలలకు రూ.41.59కోట్ల సబ్సిడీ
గృహజ్యోతి ప్రారంభమైన 10 నెలలుగా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించిన జిల్లాలోని 1,44,780 మంది వినియోగదారులకు రూ.41,59,61,982 సబ్సిడీ లభించింది. పథకం ప్రారంభమైన మార్చి నుంచి నవంబరు వరకు క్రమేపీ లబ్ధిదారులు, సబ్సిడీ పెరిగింది. అయితే డిసెంబరులో మాత్రం అదే క్రమంలో లబ్ధిదారుల సంఖ్య పెరిగినా సబ్సిడీ మాత్రం తగ్గింది. క్రమేపీ చలి పెరుగుతున్న నేపఽథ్యంలో పలువురు వినియోగదారులు ఇళ్లలో వేడి నీళ్ల కోసం హీటర్లు, గ్లీజర్లను వాడుతుండడంతో డిసెంబరు మాసానికి లబ్ధిదారుల సంఖ్య పెరిగినా, ఇతర వినియోగదారుల విద్యుత్ వినియోగం పెరగడంతో సబ్సిడీ తగ్గినట్టు ట్రాన్స్‌కో సిబ్బంది పేర్కొంటున్నారు.
పొదుపు మంచిదే : సుధీర్‌కుమార్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ
విద్యుత్ పొదుపు మంచిదే. విద్యుత్‌ను 200 యూనిట్ల లోపు వాడితే వినియోగదారులకు గృహజ్యోతి లబ్ధి వర్తిస్తుంది. అదే సమయంలో విద్యుత్ సంస్తలపై పలు భారాలు తప్పుతున్నాయి. విద్యుత్‌ను పొదుపుగా వినియోగించడం అందరూ అలవాటు చేసుకోవాలి. ఇళ్లలో వృథాగా తిరిగే ఫ్యాన్లు, వెలిగే లైట్లను ఎప్పటికప్పుడు ఆర్పివేయాలి. గృహజ్యోతి వర్తించని వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించాలి. నాణ్యమైన సేవలు అందించేందుకు తమ సిబ్బంది క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు.
నెల వినియోగదారులు సబ్సిడీ
(యూనిట్లు) (రూ.లో)
మార్చి 1,29,603 3,08,54,080
ఏప్రిల్ 1,29,603 3,86,01,396
మే 1,29,603 3,83,23,397
జూన్ 1,38,720 4,30,88,651
జూలై 1,38,190 4,23,36,422
ఆగస్టు 1,41,689 4,30,48,839
సెప్టెంబరు 1,43,641 4,75,79,571
అక్టోబరు 1,43,641 4,46,65,189
నవంబరు 1,44,569 4,94,25,118
డిసెంబరు 1,44,780 3,80,39,299
మొత్తం 1,41,780 41,59,61,962
Updated Date - Dec 23 , 2024 | 12:58 AM