చేనేత సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తా
ABN, Publish Date - Dec 22 , 2024 | 12:07 AM
పోచంపల్లి చేనేత టైఅండ్‌డై సిల్కుచీరల వ్యా పారుల, చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్య లు, కార్మికుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తానని భారత ప్రభుత్వ డెవల్‌పమెంట్ కమిషన్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ జాయింట్ కమిషనర్ నిపున్ పాండే అన్నారు. భూదాన్‌పోచంపల్లిని ఆయన శనివారం సందర్శించారు. ముందుగా పట్టణంలోని శ్రీరంజన్ సిల్క్ యూనిట్ సందర్శించి చేనేత వస్త్రతయారీ ప్రక్రియలను ఆయన పరిశీలించారు.
హ్యాండ్లూమ్స్ జాయింట్ కమిషనర్ నిపున్ పాండే
భూదాన్‌పోచంపల్లి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యో తి): పోచంపల్లి చేనేత టైఅండ్‌డై సిల్కుచీరల వ్యా పారుల, చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్య లు, కార్మికుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తానని భారత ప్రభుత్వ డెవల్‌పమెంట్ కమిషన్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ జాయింట్ కమిషనర్ నిపున్ పాండే అన్నారు. భూదాన్‌పోచంపల్లిని ఆయన శనివారం సందర్శించారు. ముందుగా పట్టణంలోని శ్రీరంజన్ సిల్క్ యూనిట్ సందర్శించి చేనేత వస్త్రతయారీ ప్రక్రియలను ఆయన పరిశీలించారు. యూనిట్ యజమాని ఎన్నం శివకుమార్‌తో సమస్యలపై చర్చించారు. అనంతరం పోచంపల్లి పట్టణంలోని చేనేత మగ్గాలను పరిశీలించారు. కార్మికు ల ఇళ్లను సందర్శించారు. చేనేత వస్త్ర తయారీ ప్రక్రియలైన వార్పు, వెప్ట్, చిటికి, యారన్ రీలింగ్, డిజైనింగ్, టై అండ్, డైయింగ్, మగ్గంపై వస్త్ర త యారీ తదితర ప్రక్రియలను పరిశీలించారు. చేనే త కార్మికులు రూపొందించిన అద్భుతమైన కళాత్మ క డిజైన్లను ఆయన పరిశీలించి వారి ప్రతిభను ప్రశంసించారు. పోచంపల్లి పట్టణంలోని పలు దుకాణదారులను కలిసి సమస్యలపై చర్చించారు. పోచంపల్లి చేనేత టైఅండ్‌డై సిల్కు చీరల ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కార్మికులతో సమావేశమయ్యారు. చేనేత వస్త్ర తయారీదారుల, కార్మికు ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేగాక, కేంద్ర ప్రభుత్వం చేనేత రంగం అభివృద్ధికి అందిం చే స్కీముల గురించి వాటిని వాడుకునే విధానం గురించి చర్చించారు. చేనేత పరిశ్రమలో వస్త్ర త యారీలు ఉన్నటువంటి మెలకువలు, కార్మికుల పనితీరులను అసోసియేషన్ అధ్యక్షుడు భారత లవకుమార్ ఆయనకు వివరించారు. కార్యక్రమం లో టైఅండ్‌డై అసోసియేషన్ అధ్యక్షుడు భారత లవకుమార్, మాజీ అధ్యక్షుడు తడక రమేష్, గౌరవాధ్యక్షుడు కర్నాటి బాలరాజు, కార్యదర్శి ముస్కూ రి నర్సింహ, ఉపాధ్యక్షులు ఈపూరి ముత్యాలు, కు డికాల రామనర్సింహ, గంజి బాలరాజు, వనం దశరథ, మంగళపల్లి రమేష్, రాపోలు శ్రీనివాస్, భార త ఆంజనేయులు, భారత భూషణం పాల్గొన్నారు.
Updated Date - Dec 22 , 2024 | 12:07 AM