ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎన్ని‘కలే’నా?

ABN, Publish Date - Dec 25 , 2024 | 12:28 AM

రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టంలో చేసిన మార్పులతో త్వరలో జరగనున్న స్థానికసంస్థల ఎన్నికల రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారనుంది.

పంచాయతీరాజ్‌ నూతన చట్టాన్ని ప్రతిపాదించిన ప్రభుత్వం

గవర్నర్‌ ఆమోదమే తరువాయి

స్థానిక సంస్థల్లో మారనున్న రిజర్వేషన్లు

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి, మోత్కూరు): రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టంలో చేసిన మార్పులతో త్వరలో జరగనున్న స్థానికసంస్థల ఎన్నికల రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారనుంది. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీ ఎన్నికల కోసం పలు సవరణలు ప్రతిపాదించ గా, చట్ట సవరణ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందింది. ఇక గవర్నర్‌ ఆమోదం తెలిపితే కొత్త చట్టం అమలులోకి రానుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న నేతల్లో అలజడి మొదలైంది.

ఉమ్మడి జిల్లాలో మొత్తం 71 మండలాలు, 1745 పంచాయతీలు, 19 మునిసిపాలిటీలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 31 మం డలాలు, 844 పంచాయతీలు, ఎనిమిది మునిసిపాలిటీలు ఉన్నా యి. సూర్యాపేట జిల్లాలో 23 మండలాలు, 475 పంచాయతీలు, ఐదు మునిసిపాలిటీలు ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో 17 మండలా లు, 426 పంచాయతీలు, ఆరు మునిసిపాలిటీలు ఉన్నాయి. గ్రామపంచాయతీ సర్పంచ్‌, ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. త్వరలో మునిసిపాలిటీల పదవీకాలం కూడా పూర్తికానుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఎన్నికల సంఘం ఇప్పటికే ఓటర్ల జాబితాను ప్రకటించడంతోపాటు ఎన్నికల సామగ్రిని కూడా సిద్ధం చేసేందుకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్‌ జారీచేసేందుకు రాష్ట్ర ఎన్నికల సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వం సైతం తొలుత పంచాయతీ ఎన్నికలు నిర్వహించి, మండల, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది.

పదేళ్ల రిజర్వేషన్‌ లేనట్టే

బీఆర్‌ఎస్‌ సర్కారు రూపొందించిన 2018-పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం స్థాని క సంస్థలైన పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ల్లో పదేళ్లపాటు (రెండు పర్యాయాలు) ఒకే రిజర్వేషన్‌ ఉండాలని నిబంధన విధించింది. అయితే, తాజా కాంగ్రెస్‌ రూపొందించి న చట్టం ప్రకారం పదేళ్ల నిబంధనను ఐదేళ్లకు మార్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చాలా మం ది నేతలు స్థానికసంస్థల్లో మరోసారి పోటీ చేయాలని ఆ పార్టీలోకి వలసబాట పట్టారు. అయితే ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రిజర్వేషన్లు మారనున్నాయి. దీంతో ఏగ్రామం, మండలంలో ఏ రిజర్వేష న్లు అమలవుతాయోనని నేతలు ఉత్కంఠగా ఉన్నారు.

మండలానికి ఐదు ఎంపీటీసీ స్థానాలు

ప్రతీ మండలానికి కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండేలా ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఇప్పటికే అమల్లో ఉన్న చట్టం ప్రకారం జనాభా ప్రాతిపదికన ఎంపీటీ సీ స్థానాలు కేటాయించడం తో కొన్ని మండలాల్లో ముగ్గురు, నలుగురే ఎం పీటీసీలు ఉన్నారు. నూతన చట్టం ప్రకారం జనాభాతో సంబంధం లేకుం డా ప్రతీ మండలానికి కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండాలని ప్రభు త్వం ప్రతిపాదించింది. ఈ నిర్ణయంతో మోత్కూరు మండలంలో ఒక ఎంపీటీసీ స్థానం పెరగనుంది. 2018లో అడ్డగూడూరు మండలం ఏర్పాటు కావడం, మోత్కూరు మునిసిపాలిటీ కావడంతో మోత్కూరు మండలంలో గ్రామపంచాయతీల సంఖ్య, మండల జనాభా తగ్గిపోయి నాలుగు ఎంపీటీసీ స్థానాలే మిగిలాయి. గత ఎన్నికల్లో నాలుగు స్థానాలకు రెండు స్థానాలను బీఆర్‌ఎస్‌, రెండు స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకున్నాయి. దీంతో ఎంపీపీ, వైస్‌ఎంపీపీలను లాటరీ విధానంలో ఎన్నుకున్నారు. బేసి సంఖ్యలో స్థానాలు ఉంటే ఈ సమస్య ఉత్పన్నమయ్యేదికాదు. పంచాయతీరాజ్‌ నూతన చట్ట సవరణ ప్రకారం యాదాద్రి జిల్లాలో మోత్కూరు మండలంలో మాత్రమే ఒకే ఒక ఎంపీటీసీ స్థానం పెరగనుంది.

అధిక సంతానం ఉంటే అనర్హులే

ప్రభుత్వం ప్రతిపాదించిన పంచాయతీరాజ్‌-2024 చట్టం ప్రకారం పలు నిబంధనలు అమలులోకి రానున్నాయి. గతంలో జనాభా పెరుగుదలను అరికట్టేందుకు చట్టసభల్లో పోటీచేసే అభ్యర్థులకు పలు నిబంధనలు ఉన్నాయి. 1994 తరువాత ఇద్దరు పిల్లల కంటే అధిక సంతానం ఉంటే వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా గత ప్రభుత్వాలు చట్టాన్ని తీసుకొచ్చాయి. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం పంచాయతీరాజ్‌-2024 చట్టంలో ఇద్దరు పిల్లల కంటే అధిక సంతానం ఉన్నా పోటీకి వెసులుబాటు కల్పిస్తుందని కొంతమంది నాయకులు ఆశాభావంతో ఉన్నారు. అయితే తాజా రూపొందించిన చట్టంలోనూ ఇద్దరు పిల్లల కంటే అధిక సంతానం ఉంటే పోటీకి అనర్హులుగానే ప్రకటించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో కొందరు పోటీచేసే అవకాశాన్ని కోల్పోనున్నారు. ఈ నిర్ణయంపై వారు నైరాశ్యంగా ఉన్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా వారికి అనుకూలంగా ఉన్న వారిని ఎన్నికల రంగంలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మునిసిపాలిటీల్లోనూ మారనున్న రిజర్వేషన్లు

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మునిసిపాలిటీల్లోనూ రిజర్వేషన్లు మారనున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 19 మునిసిపాలిటీలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పదేళ్ల రిజర్వేషన్ల విధానం మారనుండంతో ఏ వార్డులో ఏ రిజర్వేషన్లు ఉంటాయి, చైర్మన్ల పరిస్థితి ఏంటనే అంశం పట్టణ ప్రాంత రాజకీయ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. మునిసిపాలిటీ పాలకవర్గాల పదవీకాలం మరో నెల రోజుల్లోగా ముగియనుంది. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలతో పాటు మునిసిపాలిటీల ఎన్నికలను సైతం ప్రభుత్వం నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక నేతలు పోటీ చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ మేరకు అధిష్ఠానం పెద్దలను కలిసి తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు మారనుండటంతో పల్లె, పుర రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాల్సిందే.

బాకిగూడెం పంచాయతీకి ప్రతిపాదనలు

(ఆంధ్రజ్యోతి, నార్కట్‌పల్లి): పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలను పం పాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో బాకిగూడెంను కొత్త పంచాయతీగా గుర్తించే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం బెండల్‌హాడ్‌ గ్రామ పంచాయతీ మధిర గ్రామంగా బాకిగూడెం ఉంది. ఈ పంచాయతీ పరిధిలో బాకిగూడెం, నల్లోనిబావి, కచ్చకాయలబావి, అవుసలోనిబావి గ్రామాలు ఉన్నాయి. సుమారు 900కు పైగా జనాభా ఉంది. కాగా బెం డల్‌పహాడ్‌ నుంచి బాకిగూడెం వరకు సుమా రు 2.5కి.మీల దూరం ఉంది. పైగా రెండు గ్రామాల్లో జనాభా అటు ఇటుగా సమానంగానే ఉంది. పెన్షన్లు, రేషన్‌ సరుకులు, ఐకేపీ కేంద్రాల ఏర్పాటు, రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు మంజూరులో పక్షపా తం చూపిస్తున్నారనే వివాదాలు ఉన్నా యి. ఈ నేపథ్యంలో బాకిగూడెంను గ్రా మ పంచాయతీగా ఏర్పాటు చేయాలని ఇటీవల ఎమ్మెల్యే వేముల వీరేశానికి స్థానికులు వినతిపత్రం అందజేశారు. ఆయ న ఆదేశాలతో మండల పరిషత్‌ అధికారులు బాకిగూడెం, నల్లోనిబావి, కచ్చకాయలబావి గ్రా మాలను కలిపి కొత్త పంచాయతీగా బాకిగూడెంను గుర్తించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు.

Updated Date - Dec 25 , 2024 | 12:28 AM