ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఈ భారం మోయలేం

ABN, Publish Date - Dec 25 , 2024 | 12:45 AM

రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం అమలుచేయాలన్నా అధికారులకు గుర్తొచ్చేది గ్రామకార్యదర్శులు.

అప్పు చేసి పంచాయతీల నిర్వహణ

నిన్నటి దాక కులగణన, నేడు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

ఒత్తిడితో విధులు

రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం అమలుచేయాలన్నా అధికారులకు గుర్తొచ్చేది గ్రామకార్యదర్శులు. పంచాయతీరాజ్‌ శాఖ తరుపున వీరిని నియమించినా అన్నిశాఖల పనులు చేయాల్సిన పరిస్థితి వీరిది. పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి పనులకు సొంత డబ్బును వినియోగించి ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

(ఆంధ్రజ్యోతి-పెద్దఅడిశర్లపల్లి)

గ్రామపంచాయతీలకు కొన్నినెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులివ్వలేదు. ఈ ఏడాది జనవరిలో సర్పంచల పదవీకాలం ముగిసి ఫిబ్రవరి నుంచి ప్రత్యేకాధికారుల పాలన మొదలైంది. అప్పటి నుంచి పంచాయతీల నిర్వహణ కోసం కార్యదర్శులు అప్పులుతెచ్చి పనులు చేయించారు. పైప్‌లైన, వీధిలైట్లు, పారిశుధ్యం, వాహనాల డీజిల్‌, ఇతర చిన్నచిన్న అవసరాలకు కార్యదర్శులు సొంతడబ్బును ఖర్చుచేశారు. ఇలా లక్షల్లో ఖర్చు చేసిన కార్యదర్శులు ప్రభుత్వ నిధుల మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 1200మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. ఉమ్మడి పీఏపల్లి మండలంలోనే రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పైగా కార్యదర్శులు ఖర్చు చేసి ఎదురుచూస్తున్న పంచాయతీల్లో అక్కంపల్లి, అంగడిపేట, పీఏపల్లి, దుగ్యాల, పెద్దగట్టు, అజ్మాపురం ఉన్నాయి.

ఇతరశాఖల పనులు చేయాల్సిందే..

గ్రామకార్యదర్శులు తమశాఖ విధులతో పాటు ఇతరశాఖల పనులూ చేయాల్సివస్తోంది. ప్రస్తుతం మిషన భగీరథ పథకం సర్వే చేస్తున్నారు. అలాగే మరుగుదొడ్లు, వ్యవసాయ శాఖ సర్వేలను కూడా వీరికే అప్పగించారు. వాటితో పాటు విద్యాశాఖకు సంబంధించిన మరికొన్ని పనులు కట్టబెట్టారు. ఇదివరకు వీఆర్వోలు చూసే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు సంబంధించి బాధ్యతలు వీళ్లే చూస్తున్నారు. ఇటీవల కులగణన కోసం ప్రతిగడపను తొక్కాల్సి వచ్చింది. అదేవిధంగా ముసాయిదా ఓటరు జాబితా తయారీ, అభ్యంతరాల స్వీకరణ చేపట్టారు. వరుస పనుల్లో బిజీగా ఉన్న పంచాయతీ కార్యదర్శులకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను కూడా అప్పగించడంతో వారు అయోమయానికి గురవుతున్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా ఎంపీడీవో, డీఎల్‌పీవో, డీపీవో నుంచి మోమోలు జారీ చేస్తున్నారని వాపోతున్నారు.

తగిన గుర్తింపు ఇవ్వడం లేదు

ప్రభుత్వం అప్పజెప్పిన ప్రతీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రభుత్వం తమకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదు. ఆదివారం మినహాయింపు ఇవ్వాలి. సీనియారిటీ ఉన్న కార్యదర్శులకు పదోన్నతులు కల్పించాలి.

రాంచంద్‌, గ్రామ కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షుడు

పనిభారం తగ్గించాలి

పంచాయతీరాజ్‌ శాఖకు సంబంధించి అన్ని బాధ్యతలు నిర్వహిస్తన్నాం. ఇతర శాఖల పనులు కూడా చేయాలని ఒత్తిడి చేయడం భావ్యం కాదు. తమ శాఖలో పనుల ఒత్తిడి ఉన్నప్పటికీ ఇతర శాఖ లు సహాయం చేయటం లేదు.

ఆర్‌.దీప్తీ, వైస్‌ప్రెసిడెంట్‌, మండల కార్యదర్శుల సంఘం

Updated Date - Dec 25 , 2024 | 12:45 AM