ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కూలీలకు పెరిగిన డిమాండ్‌

ABN, Publish Date - Dec 25 , 2024 | 01:18 AM

వ్యవసాయ పనుల్లో కూలీల కొరత కారణంగా రైతులపై అదనపు భారం పడుతోంది.

వరి నాటుకూలీ రూ.750

పార కూలీ రూ.1000

డిమాండ్‌ పెరగడంతో పెరిగిన రేట్లు

మిర్యాలగూడ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ పనుల్లో కూలీల కొరత కారణంగా రైతులపై అదనపు భారం పడుతోంది. డీజిల్‌ రేట్లు, ఎరువు, పురుగు మందుల ధరలు పెరిగి అల్లా డుతున్న రైతులపై కూలీ రేట్ల పెంపు కూడా ‘మూలి గే నక్కపై తాటి పండు పడినట్లు’ అనే సామెతలా మారింది. యాసంగి సాగులో నాట్లన్నీ దాదాపు ఒకేసారి వేయాల్సి వస్తుండడంతో డిమాండ్‌కు తగ్గట్లుగా కూలీలు దొరక్కపోవడంతో విధిలేని పరిస్థితిలో అందుబాటులో ఉన్న కూలీలపై రైతులు ఒత్తిడి తెస్తున్నారు. డిమాండ్‌ ఉండటంతో కూలీలు రేట్లు పెంచేశారు. అదును దాటితే సాగు దిగుబడిపై ప్రమాదం ఉంటుందని రైతులు అదనపు భారం మోయడానికే సిద్ధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నల్లగొండ జిల్లాలో వానాకాలంలో 5 లక్షల 20 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా రబీలో మరో 20 వే లు అదనంగా సాగు పెరిగే అవకాశం ఉన్న ట్లు అధికారులు అంచనా వేస్తుండగా ఒకేసారి పెరిగిన కూలీ రేట్లతో యాసంగి సాగుకు రైతులు యాతన పడుతున్నారు. అదనంగా పది రోజుల్లోనే 30-40 శాతం రేట్లు పెరగడంతో సాగు చేయలేక చతికిల బడుతున్నారు. నాటు కూలీకి రూ.750, పార కూలీకి రూ.1000కు పెంచారు. సాగర్‌ జలాశయంలోకి నీరు ఆలస్యంగా చేరడంతో వానాకాలం సాగు కొంత ఆలస్యమైంది. దాంతో రైతులు పంట కాలవ్యవధి తక్కువగా ఉన్న వరిని సాగు చేశారు. ప్రస్తుతం సాగర్‌ డ్యామ్‌లో సమృద్ధిగా నీరు ఉండటంతో అధికారులు యాసంగి పంటకు ఆనఅండ్‌ ఆఫ్‌ నీటి విడుదల షెడ్యూల్‌ ప్రకటించారు. రైతులు నాట్లు వేసుకునేందుకు వీలుగా మొదటి విడతలో ఆగస్టు 15- జనవరి-11 వరకు 27 రోజులు నిరంతరాయంగా నీరు విడుదల చేస్తున్నారు. దీంతో రైతులందరూ వరినాట్ల పనులను పూర్తి చేసేందుకు పొలాలు దమ్ము చేసుకుని వరాల పనికి, నాట్ల కూలీలను సమకూర్చుకుంటుండంతో పని ఒత్తిడి పెరిగి రేట్లు పెంచుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎరువులు చల్లితే..

ఒక బస్తా ఎరువు చల్లితే రూ.130, దానిలో ఏదైన మిశ్రమం కలిపితే(గుళికలు, జింకు లాంటి) రూ.150కి పెంచారు. గతంలో ఈ కూలీ 100-130 గా వుండేది. నాట్లు వేసిన తురువాత నాట్ల మధ్య బాటలు తీసే కూలీ రేట్లను సైతం పెంచారు. ఎకరం పొలంలో బాటలు తీసినందుకు గాను రూ. 350 వుండగా ఈ సీజనలో దానిని 400కు పెంచారు.

వ్యవసాయ పనులపై కూలీల అనాసక్తి

రానురాను వ్యవసాయ పనులపై కూలీలకు అనాసక్తి పెరుగుతోంది. వ్యవసాయ కూలీలలో 80 శాతానికి పైగా ప్రస్తుతం 50 ఏళ్లకు పైబడినవారే కావడం గమనార్హం. వ్యవసాయ పనుల్లో శారీరక శ్రమ ఎక్కవ అవడంతో కొత్తతరం వ్యవసాయ పనులవైపు రావడం లేదని పరిశీలకుల అభిప్రాయం. నాట్లు వేయడం తెలియక పోవడం కూడా కూలీల కొరతకు కొంత కారణంగా భావిస్తున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువ సంపాదనకు యువత పట్టణాలవైపు చూస్తుండటంతో వ్యవసాయ పనుల్లో మానవ వనరులు తగ్గిపోతున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో పని ఒత్తిడి పెరిగి కూలీల డిమాండ్‌ పెరగడంతో రైతుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనలో కూలీ రేట్లు అమాంతం పెంచుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

30-40 శాతం పెరిగిన రేట్లు

నాటు కూలీ రేటు రూ.750కి చేరుకుంది. 10 రోజుల క్రితం వరకు ఒక్కరికి రూ. 400 కూలీ కాగా ఇంటి నుంచి పొలం వద్దకు చేర్చేందుకు రూ.50 ఆటో చార్జీతో కలిపి రైతులు 450 చెల్లించేవారు. దానిని మూడు రోజుల్లో 550 కి పెంచగా ప్రస్తుతం రూ. 750కి చేర్చారు. రోజుకు 8 మంది ఆడకూలీలు నారు పీకి ఎకరం నాటు వేస్తారు. నారు పంచి వేయడానికి ఒక మగ కూలీకి రూ.1000 కలిపి ఎకరం నాటుకు రూ.7,000 వ్యయం అవుతోంది. గతంలో నారు పీకడం, నారు పంచుకోవడం, నాటు వేయడం కలిపి గుత్తాగా ఎకరం రూ. 4,300కు చేసేవారు. ఈ సీజనలో గుత్తా కూలీ కూడా అదనంగా 300 పెంచి ఎకరం కూలీ రూ.4,600 చేశారు. గుత్తా కూలీలు దొరకని సందర్భంలో విడి కూలీలతో పని చేయిస్తే రైతుకు ఎకరం నాటు కూలీ 5,500 వరకు పడుతుండగా పెరిగిన రేట్లతో 1500-2000 వరకు అదనపు భారం పడుతోందని అంటున్నారు. పని ఒత్తిడి మూలంగా 10రోజుల్లోనే రూ.300 పెరగడంతో రైతులు విలవిలలాడుతున్నారు. దీనికి తోడు వరాలు తీసే పారకూలీ రోజుకు 800 నుంచి 1000 రూపాయలకు పెంచారు.

Updated Date - Dec 25 , 2024 | 01:18 AM