స్వాతంత్రానికి ముందే ఐఎన్‌టీయూసీ ఆవిష్కరణ
ABN, Publish Date - Dec 30 , 2024 | 12:15 AM
భారత దేశానికి స్వాతంత్రం సిద్ధించకముందే కార్మికుల అవసరాలకోసం ఐఎన్‌టీయూసీ ఆవిర్భవించిందని ప్రభు త్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు.
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
ఆలేరు, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): భారత దేశానికి స్వాతంత్రం సిద్ధించకముందే కార్మికుల అవసరాలకోసం ఐఎన్‌టీయూసీ ఆవిర్భవించిందని ప్రభు త్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకంక్షలు తెలుపుతూ ఐఎన్‌టీయూసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన 2025 నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆయన ఆదివారం ఆలేరులోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడారు. కాం గ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థగా ఉన్న ఐఎన్‌టీయూసీ కార్మికుల హక్కుల సాధనకు పోరాడుతోందని, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముఖ్యపాత్ర పోషించిందన్నారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు సుడుగు జీవన్‌రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలేటి అనిల్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎజాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ముదికొండ శ్రీకాంత్, నాయకులు శ్రీనివాస్, యాదగిరి, ప్ర భాకర్, చంద్రం, లింగం, నాగరాజు, సిద్దులు, వెంకటేశ్, యాదగిరి పాల్గొన్నారు.
(ఆంధ్రజ్యోతి, యాదగిరిగుట్ట రూరల్): ఐఎన్‌టీయూసీ 2025 నూతన క్యాలెండర్‌ను బీర్ల అయిలయ్య ఆయన నివాసంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సుడుగు జీవన్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్, నాయకులు శ్రీకాంత్, రాజిరెడ్డి, ఎగ్గిడి మల్లయ్య పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్‌ఎంపీ, పీఎంపీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఆ సంఘం మండల అధ్యక్షుడు బత్తిని వెంకటేశం అన్నారు. ఆదివారం గుట్టలో విప్ బీర్ల అయిలయ్యకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో గడ్డమీది నర్సింహగౌడ్, ఆకుల నర్సింహ, పాల్గొన్నారు.
Updated Date - Dec 30 , 2024 | 12:15 AM