ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మాత, శిశు మరణాలు లేని జిల్లాగా మార్చాలి

ABN, Publish Date - Dec 19 , 2024 | 12:34 AM

నల్లగొండను మాత, శిశు మరణాలు లేని జిల్లాగా మా ర్చాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అదేశించారు. కలెక్టరేట్‌ లో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రసవ సమయంలో, ప్రసవం తర్వాత మాతృ మరణా లు, శిశు మరణాలు లేకుండా చూడాలన్నారు.

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

నల్లగొండ రూరల్‌, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): నల్లగొండను మాత, శిశు మరణాలు లేని జిల్లాగా మా ర్చాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అదేశించారు. కలెక్టరేట్‌ లో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రసవ సమయంలో, ప్రసవం తర్వాత మాతృ మరణా లు, శిశు మరణాలు లేకుండా చూడాలన్నారు. మాతృ, శిశు మరణాలు జరిగితే అందుకు సంబంధిత శాఖల అధికారులే బాధ్యత వాహించాలన్నారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యంతో ఏ తల్లీ బాధ పడ కూడదన్నారు. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవమయ్యే వరకు, ప్రసవానంతరం కూడా పూర్తిగా వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడిఎస్‌ పర్యవేక్షణలో ఉండాలన్నారు. నెల నెలా వైద్య పరీక్షలు, ఇమ్మునైజెషన్‌, పౌష్ఠికాహారం అందించాలన్నారు. ప్రిస్కెప్షన్‌ లేకుండా కొన్ని మెడికల్‌ షాపుల్లో మం దులు, ఆస్పత్రుల్లో ఆబార్షన్‌ కిట్లు విక్రయిస్తున్న తమ దృష్టికి వచ్చిందన్నారు. వైద్యుల అనుమతి లేకుండా అబార్షన్‌ కిట్లు అమ్మడం, కొనడం చట్ట రీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాణాలు కాపాడటమే వైద్యులు విధి గా పనిచేయాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సమయం ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉండా లన్నారు. మాతా, శిశు మరణాలు నివారించే విషయంలో ఇకపై ఏరియా ఆసుపత్రుల వారీ గా, డివిజన్ల వారీగా సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్‌, అబార్షన్‌ వంటి వాటి పట్ల పట్టణ స్థాయి మొదలుకొని గ్రామస్థాయి వరకు అవగాహన కల్పించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పుట్ల శ్రీనివాస్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి

కొండమల్లేపల్లి, (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల కో సం వచ్చిన దరఖాస్తులను క్షణ్ణంగా పరిశీలిచాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సూచించారు. మండలంలోని గుర్రపుతండా పరిధిలోని దర్గాతండాలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు పరిశీలించారు. ఇల్లు మొత్తం వచ్చేలా ఫొటో లో తీయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకొని వలస వెళ్లిన వారికి ఫోన్‌ లేదా ఇతరత్ర మార్గాల ద్వారా సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోని వారు ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆమె వెంట ఆర్డీవో రమణారెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్‌, ఎంపీడీవో బాలరాజురెడ్డి ఉన్నారు.

చింతపల్లి ఎంపీడీవోకు షోకాజ్‌ నోటీసు

చింతపల్లి, (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన చింతపల్లి ఎంపీడీవో సుజాతకు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మండలంలోని గాసీరాంతండా, నసర్లపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల వివరాలు బుధవారం క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన రమావత్‌ శంకర్‌, కొర్ర సరిత తదితర దరఖాస్తులను కలెక్టర్‌ పరిశీలించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ దరఖాస్తుల్లో ఫొటోలతో వివరాలు పొందుపరచలేదు. ఆన్‌లైన్‌ యాప్‌పై సిబ్బందికి అవగాహన కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంపీడీ వోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశారు. వీధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్‌ వెంట దేవరకొండ ఆర్డీవో రమాణారెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

గుర్రంపోడు, (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాటి ఆదేశించారు. మండలంలోని జిన్నాయిచింత గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను బుధవారం పరిశీలించారు. సర్వే వివరాలు పంచాయతీ కార్యదర్శి స్వీటీ, ఎంపీజీవో మంజూలను అడిగి తెలుసుకున్నారు. జిన్నాయిచింత గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 177 మంది దరఖాస్తులు చేసుకోగా ఇప్పటి వరకు 77 దరఖాస్తుల వివరాలను తనిఖీ చేసి అప్‌లోడ్‌ చేసినట్లు పంచాయతీ కార్యదర్శి కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో రమణారెడ్డి, హౌసింగ్‌ పీడీ రాజ్‌కుమార్‌, ఎంపీవో పద్మ ఉన్నారు.

Updated Date - Dec 19 , 2024 | 12:34 AM