ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BRS: కాంగ్రెస్ పార్టీకి కేంద్రంతో లోపాయకారి ఒప్పందం: జగదీష్ రెడ్డి

ABN, Publish Date - Feb 12 , 2024 | 03:22 PM

నల్గొండ: మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన నల్గొండలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి కేంద్రంతో లోపాయకారి ఒప్పందం ఉందన్నారు.

నల్గొండ: మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన నల్గొండలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి కేంద్రంతో లోపాయకారి ఒప్పందం ఉందన్నారు. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు సాగర్ ప్రాజెక్టును ఆక్రమించడానికి ఏపీ వస్తే మేమే తరిమామని, ప్రస్తుతం కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సాగర్ ప్రాజెక్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. కృష్ణా జలాల హక్కులపై బీఆర్ఎస్ పోరాటంతోనే కేఆర్ఎంబీకి అప్పగించలేదని కాంగ్రెస్ తీర్మానం చేసిందన్నారు. కృష్ణా జలాల సాధన కోసం రేపు (మంగళవారం) నల్గొండలో బీఆర్ఎస్ సభ నిర్వహించనుందని.. ఈ కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి ప్రజలు భారీగా హాజరవుతారన్నారు. కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 03:22 PM

Advertising
Advertising