Jagadish Reddy: విచారణ అధికారిని మార్చాలనే హక్కు కేసీఆర్‌కు ఉంది: జగదీశ్ రెడ్డి
ABN, Publish Date - Jun 16 , 2024 | 02:21 PM
బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్ల(Electricity Purchage) అక్రమాలపై ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి((Justice Narasimha Reddy)) కమిషన్ ముందే ఓ నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఈ విషయం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి.. కేసీఆర్(KCR)పై చేసిన వ్యాఖ్యల ద్వారా తెలుస్తోందన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్ల(Electricity Purchase) అక్రమాలపై ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి(Justice Narasimha Reddy) కమిషన్ ముందే ఓ నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఈ విషయం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి.. కేసీఆర్(KCR)పై చేసిన వ్యాఖ్యల ద్వారా తెలుస్తోందన్నారు. అందుకే నరసింహారెడ్డిని కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖలో రాశారని జగదీశ్ రెడ్డి అన్నారు.
విచారణ అధికారిని మార్చాలనే హక్కు కేసీఆర్‌కు ఉంది..
విచారణ అధికారిని మార్చాలని కోరే హక్కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందన్నారు. కోర్టుల్లోనూ ఫలానా జడ్జి విచారణ జరుపొద్దని కోరే అవకాశం ఉందని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల అభిప్రాయాలకు అనుకూలంగా కమిషన్ అభిప్రాయం ఉందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ పట్ల వ్యతిరేక అభిప్రాయంతో నరసింహారెడ్డి ఉన్నారన్నారు. ఈఆర్సీ అనేది స్వతంత్ర కమిషన్. అది ఇచ్చిన తీర్పులపై ప్రభుత్వానికి విచారణ జరిపే అవకాశం ఉండదు. ఈ విషయం హైకోర్టు జడ్జిగా పనిచేసిన నరసింహారెడ్డికి తెలిసి ఉండాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఉద్ఘాటించారు. అయినా విచారణకు ఎలా ఒప్పుకున్నారు. కమిషన్ నియామకమే అసంబద్ధం. ఆ బాధ్యతల నుంచి ఆయన వెంటనే తప్పుకుంటారని ఆశిస్తున్నామన్నారు.
ఛతీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్ కూడా తప్పు చేశారా?
ప్రభుత్వ రంగ సంస్థలతోనే మేము విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నాం. ఛతీస్‌గఢ్ ఒప్పందంలో ఆనాటి బీజేపీ సీఎం రమణ్ సింగ్ కూడా తప్పు చేశారా? అని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. ఛతీస్‌గఢ్ ప్రభుత్వ పెద్దలనూ విచారణకు పిలవాల్సింది. ప్రభుత్వ రంగ సంస్థలు.. ప్రభుత్వ పెద్దలకు లంచాలు ఇస్తాయా?. 2017తర్వాత చేపట్టే ప్రాజెక్టులకు సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాలని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. కానీ అప్పటివరకు ఏ టెక్నాలజీ అయినా ఉపయోగించవచ్చని చెప్పింది. న్యాయాధికారిగా హోదాలో ఉన్న వ్యక్తి జాగ్రత్తగా మాట్లాడాలి. కేసీఆర్ మీద బురద చల్లడమే జస్టిస్ నరసింహారెడ్డి ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది" అని జగదీశ్ రెడ్డి ఆరోపించారు.
Updated Date - Jun 16 , 2024 | 02:21 PM