కలిసికట్టుగా పోరాడితేనే రాజ్యాధికారం
ABN, Publish Date - Dec 26 , 2024 | 12:05 AM
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఐక్యంగా కలిసి పోరాడినప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని బీసీ హక్కుల సాధన సమితి సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.ధనుంజయనాయుడు అన్నారు.
నేరేడుచర్ల, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఐక్యంగా కలిసి పోరాడినప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని బీసీ హక్కుల సాధన సమితి సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.ధనుంజయనాయుడు అన్నారు. బుధవారం నేరేడుచర్లలో మనుధర్మ స్మృతుల ప్రతులను దహనం చేసి మాట్లాడారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మనుధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని ఎస్సీ వర్గీకరణతోపాటు అనేక అంశాలను పక్కదోవ పట్టిస్తోందన్నారు. దేశంలో 92శాతం పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలను అధికారంలోకి రాకుండా కేవలం ఎనిమిది శాతం మాత్రమే ఉన్న అగ్రవర్ణాల వారు దశాబ్దాల నుంచి అధికారం చెలాయిస్తున్నారన్నారు. అందుకోసమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఐక్యం కావాలని, అప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు చిలకరాజు శ్రీను, ఏఐఎ్‌సఎఫ్ జిల్లా నాయకుడు కొమర్రాజు వెంకట్, మల్గిరెడ్డి జనార్ధన్‌రెడ్డి, పానుగంటి మహేష్, మజరత్, కాటయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు.
నాగారం: మండలంలోని ఫణిగిరిలో మనుధర్మశాస్త్ర ప్రతులను పలువురు యువకులు దహనం చేశారు. ఈ సందర్భం గా పలువురు నాయకులు మాట్లాడుతూ మనుధర్మశాస్త్రాని కేంద్రంలో ఉన్న బీజేపీ అనుసరిస్తోందని, దళితులపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎర్ర రాంబాబు, దారం నాగారాజు, ఎస్‌కె నజీ ర్, నగేష్, యశ్వంత్, మహే్‌ష, రిత్విక్ పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2024 | 12:05 AM